Ileana D’Cruz : నా బిడ్డకు తండ్రి ఇతనే…క్లారిటీ ఇచ్చిన ఇలియానా…

Ileana D’Cruz : పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. అమీజాక్సన్ తర్వాత అలాంటి ఘనత సాధించిన ఏకైక నటి ఇలియానా అని చెప్పాలి. అమీ జాక్సన్ అంటే విదేశీ నటి కాబట్టి అక్కడ కల్చర్ ప్రకారం అలా చేసింది. కానీ భారతదేశంలో పుట్టిన ఇలియానాకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందంటూ పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తన బిడ్డకు […]

  • Published On:
Ileana D’Cruz : నా బిడ్డకు తండ్రి ఇతనే…క్లారిటీ ఇచ్చిన ఇలియానా…

Ileana D’Cruz : పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. అమీజాక్సన్ తర్వాత అలాంటి ఘనత సాధించిన ఏకైక నటి ఇలియానా అని చెప్పాలి. అమీ జాక్సన్ అంటే విదేశీ నటి కాబట్టి అక్కడ కల్చర్ ప్రకారం అలా చేసింది. కానీ భారతదేశంలో పుట్టిన ఇలియానాకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందంటూ పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమని కొందరు ప్రశ్నించిన సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

he-is-the-father-of-my-child-ileana-who-gave-clarity

 

కేవలం తనకు పుట్టిన బిడ్డ ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ భర్త వివరాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచింది. అయితే ఏదో ఒక రోజు నిజం చెప్పక తప్పదు కదా. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తన భర్త ఎవరో చెప్పేసింది. అయితే గతంలో ఇలియానా డేట్ నైట్ అంటూ ఓ వ్యక్తితో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాని ఆ వ్యక్తి తన భర్త అనే విషయం మాత్రం తెలియజేయ లేదు. దీంతో ఆ సమయంలో అసలు అతను ఎవరు..?ఇలియానాతో అంత క్లోజ్ గా ఉన్నాడు…?అని చాలామందిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

he-is-the-father-of-my-child-ileana-who-gave-clarity

అతను స్నేహితుడా లేక తన ప్రియుడా అనే సందేహాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా వాటన్నింటికీ సమాధానం ఇస్తూ అతనితో దిగిన ఫోటోను షేర్ చేసింది ఇలియానా. అంతేకాక ఇతనే నా భర్త అని ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే సోషల్ మీడియా లో అభిమానులతో ఇంట్రాక్ట్ అయిన ఇలియానకు ఓ ప్రశ్న ఎదురయింది. సోషల్ మీడియాలో ఓ అభిమాని మీ సింగిల్ పేరింటింగ్ ఎలా ఉంది అని ప్రశ్నించగా..నేను సింగిల్ కాదు అంటూ ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసింది. తన బిడ్డకు అతనే తండ్రి అని ఈ పోస్ట్ ద్వారా తెలియజేసింది. అయితే భర్త అతనే అని చెప్పింది కానీ అతని పేరేంటి..?ఏం చేస్తాడు…? విదేశీయుడా…? స్వదేశీయుడా…? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.