Ram Charan – Sara Tendulkar : రామ్ చరణ్ సినిమాలో సారా టెండూల్కర్ కి ఛాన్స్…అంత డైరెక్టర్ మహిమ…
Ram Charan – Sara Tendulkar : ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని తీసుకురావాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కి జోడిగా స్టార్ […]
Ram Charan – Sara Tendulkar : ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రామ్ చరణ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని తీసుకురావాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కి జోడిగా స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ను తీసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జరుగుతున్నది.
అయితే ఇప్పటికే చాలాసార్లు సచిన్ టెండూల్కర్ కూడా రాజ్ కుమార్ హీరానితో కలిసి చర్చలు జరిపి తన కూతురు సారాని ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందిగా కోరాడట. అయితే సచిన్ వచ్చి స్వయంగా అడగడంతో మంచి కథ వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని డైరెక్టర్ మాట ఇచ్చారట. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ తో తాను చేయబోయే సినిమాలో సారా టెండూల్కర్ ను హీరోయిన్ గా పరిచయం చేయాలని రాజకుమార్ భావిస్తున్నారట. అయితే దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సచిన్ ఫ్యాన్స్ మరియు రామ్ చరణ్ ఫాన్స్ ఈ వార్త నిజమైతే బాగుండు అని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏమవుతుందో వేచి చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ నేతృత్వంలో వస్తున్న ” గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి మరో సినిమాలో రామ్ చరణ్ నటించిబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఒకవైపు బుచ్చిబాబుతో ఈ సినిమా చేస్తూ మరోవైపు బాలీవుడ్ లో కూడా మరో సినిమా చేయాలని రామచరణ్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ ని హీరోయిన్ గా అనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.