Prabhas – Anushka Shetty : ప్రభాస్ అనుష్క పెళ్లిపై మరోో రూమర్…మార్చిలో ఎంగేజ్మెంట్… ఏప్రిల్ లో పెళ్లి…

Prabhas – Anushka Shetty : ప్రభాస్ అనుష్కల పెళ్ళికి ముహూర్తం ఖరారయింది. అవును ఈ ఏడాది నెల రోజుల తేడాతో నిశ్చితార్థం పెళ్లి జరగబోతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. ఇందులో నిజం ఎంత అంటే ప్రభాస్ అనుష్క ఇద్దరికీ 40 ఏళ్లు దాటాయి కానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. పోనీ ఇద్దరు విడిగా చేసుకుంటారు అంటే లేదు ఇద్దరు ప్రేమించుకుని ఒకటై పోతారా అంటే అది కూడా లేదు. […]

  • Published On:
Prabhas – Anushka Shetty : ప్రభాస్ అనుష్క పెళ్లిపై మరోో రూమర్…మార్చిలో ఎంగేజ్మెంట్… ఏప్రిల్ లో పెళ్లి…

Prabhas – Anushka Shetty : ప్రభాస్ అనుష్కల పెళ్ళికి ముహూర్తం ఖరారయింది. అవును ఈ ఏడాది నెల రోజుల తేడాతో నిశ్చితార్థం పెళ్లి జరగబోతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. ఇందులో నిజం ఎంత అంటే ప్రభాస్ అనుష్క ఇద్దరికీ 40 ఏళ్లు దాటాయి కానీ పెళ్లి ఊసు ఎత్తడం లేదు. పోనీ ఇద్దరు విడిగా చేసుకుంటారు అంటే లేదు ఇద్దరు ప్రేమించుకుని ఒకటై పోతారా అంటే అది కూడా లేదు. ఎవరికి వారే యమునా తీరుగా అన్నట్లు ఉన్నారు. కానీ వీరి పేరు మీద వార్తలు వర్షం నీరులా వస్తూనే ఉన్నాయి. వర్షం తగ్గిన కొన్నాళ్ళకు వరదలు తగ్గినట్లు వార్తలు కూడా ఆగిపోతున్నాయి. తాజాగా మరోసారి వీరి పెళ్లి గోల మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టుల దగ్గర నుంచి కోట్లాది జనాల వరకు ఇప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ప్రభాస్ పెళ్లి గురించి వార్త వచ్చేసింది సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి గురించి వస్తున్న ఒక వార్త న్యూస్ హాట్ న్యూస్ గా మారింది.

another-rumor-about-prabhas-anushkas-marriage-engagement-in-march-marriage-in-april

ఆరడుగుల అందగాడు పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రభాస్ పెళ్లి గురించి టాప్ సీక్రెట్ రెబెల్ ఫ్యామిలీ నుంచి లీక్ అయిన వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది మార్చిలో ఎంగేజ్మెంట్ ఆ తర్వాత వచ్చే ఏప్రిల్ ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తలను బాగా వైరల్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఒక ఇంటి వాడైతే చూడాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటే మరి కొంతమంది ప్రభాస్ అనుష్కలను జంటగా చూడాలని కోరుకుంటున్నాను. అందుకే ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్ అనుష్కలపై ఈ వార్తలు కొత్తగా వచ్చినవి ఏమి కాదు.  వారిద్దరి పై గతంలోని కూడా ఫ్యాన్స్ ఇద్దరు మంచి జోడి అని మిర్చి సినిమా నుంచి ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ అప్పటి నుంచే వీరి పైన రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.

another-rumor-about-prabhas-anushkas-marriage-engagement-in-march-marriage-in-april

మిర్చి సినిమాలో ఒక ఛాన్స్ ఇస్తావా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అనే డైలాగ్ ఎంతో ఫేమస్ అయింది. మళ్లీ బాహుబలి సినిమా తో వీరి బంధం మరింత బలపడింది అని ఫ్యాన్స్ అభిప్రాయం. ఇక వీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అని గతంలో పుకారు కూడా బయటకు వచ్చాయి. అంతేకాదు వీరు అమెరికాలో ఉండడానికి ఇల్లు కూడా కొన్నారు అని రూమర్ గట్టిగా వినిపించింది. అంతెందుకు మొన్నటికి మొన్న వీరిద్దరు పెళ్లి అంటూ మీరు ఫోటోలోని గ్రాఫిక్స్ డిజైన్ చేసిన ఫొటోస్ వైరల్ కూడా అయ్యాయి. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే వీరికి ఒక పాప కూడా పుట్టినట్లు చూపించారు. ఏది ఏమైనా కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అటు అనుష్క ఫ్యాన్స్ వీరి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ కి లేక అనుష్కకి వీరిద్దరిలో ఎవరొవకరికి పెళ్లి జరిగితే గాని ఈ రూమర్స్ కి చెక్ పడదు అని చెప్పాలి.