Anasuya Bharadwaj : జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ…వీడియో వైరల్…

Anasuya Bharadwaj  : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మంచి గ్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభినయంతో వెండితెరపై అవకాశాలు దక్కించుకొని వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది.ఇక ఇవి మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో ఆమె నడిపించే హవా మామూలుగా ఉండదు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా తనపై ఎన్ని ట్రోల్స్ చేసినా అసలు […]

  • Published On:
Anasuya Bharadwaj : జిమ్ లో తెగ కష్టపడుతున్న అనసూయ…వీడియో వైరల్…

Anasuya Bharadwaj  : యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై మంచి గ్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభినయంతో వెండితెరపై అవకాశాలు దక్కించుకొని వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతుంది.ఇక ఇవి మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో ఆమె నడిపించే హవా మామూలుగా ఉండదు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా తనపై ఎన్ని ట్రోల్స్ చేసినా అసలు లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ వస్తుంది అనసూయ. తనని ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి చాలాసార్లు గట్టి వార్నింగ్ ఇచ్చిన అనసూయ ప్రతి నిమిషం సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటూ తనని ట్రోల్ చేసే వారికి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.

Anasuya Bharadwaj in white bikini flaunts her fine natural curves - see hot pics.

అంతేకాక సోషల్ మీడియా వేదికగా అనసూయ చూపించే అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ క్రమంలోనే తాజాగా దసరా పండుగ సందర్భంగా అనసూయ భరద్వాజ్ జిమ్ లో తాను చేస్తున్న వర్కౌట్ కి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను అనసూయ నెట్టింటా పంచుకుంది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ మహిళలను ప్రోత్సహించేలా సుదీర్ఘమైన నోట్ రాసింది. ఈ సమాజంలోని దుష్ట శక్తులపై పోరాడుతూ సాధారణ మహిళ నుండి మహాకాలి లాగా మారాల్సి ఉందని ఆమె చెప్పకు వచ్చింది. ఇక ఈ దసరాను చెడు పై మంచి సాధించిన విజయం గా జరుపుకోండి సోమరితనాన్ని జయించండి అని చెప్పుకొచ్చింది.

అయితే కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నను కోల్పోయాను, ఒక్కసారిగా అన్నిటిపై ఆశలు పోయాయి, ఇక అదే సమయంలో ఆహారపు అలవాట్లు నిద్ర గాడి తప్పయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మా నాన్న ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఇది ఈ దసరాతో ప్రారంభించాను. మహిళలందరినీ ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను అంటూ అనసూయ వీడియోని షేర్ చేసింది. అలాగే నీకు ఇప్పుడు ఇదంతా అవసరమా ఆంటీ 35 సంవత్సరాలు దాటిన నీకు ఎందుకు ఇవన్నీ ఇంట్లో పిల్లలని చూసుకోవచ్చు కదా..అనేవారు మన స్వతంత్రానికి భయపడి ఇలాంటి విమర్శలు చేస్తుంటారు అని తన నోట్లో అనసూయ పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)