Adipurush: అయోధ్యకి రాముడొస్తున్నాడు,ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్..

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆదిపురుష్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా , ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు. సినిమా ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా […]

  • Published On:
Adipurush: అయోధ్యకి రాముడొస్తున్నాడు,ఆదిపురుష్ టీజర్ డేట్ ఫిక్స్..

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఆదిపురుష్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా , ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు. సినిమా ప్రకటించి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి కూడా సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ పోస్టర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతున్నారు. డైరెక్టర్ ఓం రౌత్ బయట ఎక్కడ కనపడినా, సోషల్ మీడియాలో కూడా ఆదిపురుష్ సినిమాపై అప్డేట్స్ గురించే అడుగుతున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. గత కొన్ని రోజులుగా దసరా పండగకి ఆదిపురుష్ నుంచి టీజర్ వస్తుందని వార్తలు వస్తున్నా చిత్ర యూనిట్ మాత్రం ఎవరూ స్పందించలేదు. తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ దీనిపై అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.కృతి సనన్, ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోని ఓం రౌత్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”మా మ్యాజికల్ జర్నీ ఇప్పుడు మీ అందరిది. మీరంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా టీజర్, ఫస్ట్ పోస్టర్ అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్ అయోధ్యలో సరయు నది ఒడ్డున రిలీజ్ చేయబోతున్నాము.

ఈ సినిమా 2023 సంక్రాంతి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 3D, ఐమ్యాక్స్ ఫార్మెట్ లలో కూడా రిలీజ్ చేస్తున్నాము” అని పోస్ట్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషీ అయ్యారు. టీజర్ కోసం అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Must Read: fenugreek tips: మెంతుల నీటిని తాగితే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

 

View this post on Instagram

 

A post shared by Om Raut (@omraut)