Actress Pragathi : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…వరుడు ఎవరంటే…

Actress Pragathi  : టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై హీరో తల్లి పాత్రలో ,ఇతరత్రా క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. అంతేకాక సోషల్ మీడియా వేదికగా తనకంటూ మంచి ఇమేజ్ ను ఏర్పరచుకుంది. ఇక లాక్ డౌన్ తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ సంపాదించుకుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె తన భర్తతో […]

  • Published On:
Actress Pragathi  : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…వరుడు ఎవరంటే…

Actress Pragathi  : టాలీవుడ్ ప్రముఖ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వెండితెరపై హీరో తల్లి పాత్రలో ,ఇతరత్రా క్యారెక్టర్స్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది. అంతేకాక సోషల్ మీడియా వేదికగా తనకంటూ మంచి ఇమేజ్ ను ఏర్పరచుకుంది. ఇక లాక్ డౌన్ తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ సంపాదించుకుందో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె తన భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటినుండి తన ఇద్దరు పిల్లలతోనే గడుపుతూ ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది.

actress-pragathi-second-marriage-at-the-age-of-47

అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సింగర్ సునీత కొన్ని ఏళ్ళ క్రితం రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అదే బాటలో ప్రగతి కూడా వెళుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకున్న ప్రగతి పెద్ద తప్పే చేశానని పలుమార్లు ఇంటర్వ్యూలలో కూడా చెప్పటం మనం చూశాం. ఇక భర్త లేకుండానే పిల్లలను తీర్చిదిద్ది , ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడగలిగింది.

actress-pragathi-second-marriage-at-the-age-of-47

అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ను ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో కూడా ప్రగతి రెండో పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ అవేమి వాస్తవాలు కాలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ వార్తలు నిజమన్నట్టు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాక ప్రగతి ఇష్టానుసారం నిర్మాత మొదట పెళ్లి ప్రపోజల్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రగతి వయసు 47 సంవత్సరాలు. ఇక ఆమె మొదటి పెళ్లి 21 సంవత్సరాలు వయసులోనే పేటాకులు అవ్వడం జరిగింది. ఈ క్రమంలోని ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.