Viral Video : ఉప్పుతో గీసిన వలయంలో నాగుపాము ను ఉంచితే ఏమవుతుంది…క్లారిటీ ఇచ్చిన యూట్యూబర్…

Viral Video : ఎదురుగా పాము కనిపిస్తే చాలు చాలామంది వెన్ లో వణుకు పుడుతుంది. పాము కలలో కనిపించిన గుండె ఆగినంత పని అవుతుంది. అయితే ప్రపంచంలోనే విషపూరితమైన పాములలో నాగుపాము కూడా ఒకటి. ఇక ఈ నాగపాము చుట్టూ ఎన్నో పురాణాలు మరియు కథలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో నాగుపాము కు సంబంధించి ఎన్నో రకాల అపోహలు వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నాగుపామును దేవతగా కూడా కొలుస్తారు. అయితే […]

  • Published On:
Viral Video : ఉప్పుతో గీసిన వలయంలో నాగుపాము ను ఉంచితే ఏమవుతుంది…క్లారిటీ ఇచ్చిన యూట్యూబర్…

Viral Video : ఎదురుగా పాము కనిపిస్తే చాలు చాలామంది వెన్ లో వణుకు పుడుతుంది. పాము కలలో కనిపించిన గుండె ఆగినంత పని అవుతుంది. అయితే ప్రపంచంలోనే విషపూరితమైన పాములలో నాగుపాము కూడా ఒకటి. ఇక ఈ నాగపాము చుట్టూ ఎన్నో పురాణాలు మరియు కథలు దాగి ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో నాగుపాము కు సంబంధించి ఎన్నో రకాల అపోహలు వినిపిస్తూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో నాగుపామును దేవతగా కూడా కొలుస్తారు. అయితే ఈ పాములను కూడా భయపెట్టేలా చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉప్పుతో గీసిన వలయం.

ఇది పురాతన కాలం నుండి గ్రామాల్లో చలామణి అవుతున్న అపోహ. అయితే దీనిలో ఎంత నిజం ఉందో తెలుసుకునేందుకు ఓ యూట్యూబ్ ఈ సాహసం చేశాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అమిత్ కుమార్ అనే ఓ యూట్యూబర్ ఈ ప్రయోగాన్ని చేశాడు. దీనికోసం ముందుగా అమిత్ రెండు పాములను విక్రయించాడు. తర్వాత వాటిని తీసుకొని బహిరంగ ప్రదేశానికి వెళ్లి, ఓ నిర్మానుష ప్రదేశంలో ఉప్పుతో ఒక వలయాన్ని గీశాడు.

తర్వాత ఆ వలయంలో రెండు నాగుపాములను విడిచిపెట్టాడు. ఇక ఆ నాగుపాములలో ఒకటి కొద్దిసేపటికి ఉప్పు వలయాన్ని దాటుకుని బయటికి రాగా మరో నాగుపాము మాత్రం చాలా సేపటి తర్వాత వలయాన్ని దాటి బయటకు వచ్చింది. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నేటి జనులు వరుస పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమిత్ అనే యువకుడు చేస్తున్న ప్రయత్నానికి అందరు ప్రశంసిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు ఓ లుక్కెయ్యండి.