Hyderabad :  హైదరాబాద్ నడిబొడ్డున అండర్ వాటర్ ఎగ్జిబిషన్..ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా…చాలా చీప్..

Hyderabad  : వేసవికాలంలో హైదరాబాద్ నగరవాసులు రకరకాల ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు పెద్దలు కుటుంబంతో కలిసి పర్యాటక స్థలాలకు వెళ్లి కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతుంటారు. అలాంటి నగరవాసుల కోసం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఓ అద్భుతం కనువిందు చేస్తుంది. అయితే విదేశాల్లో నీటి లోపల టన్నెళ్లను ఏర్పాటు చేసి దానిలో నుండి వివిధ రకాల చేపలను దగ్గర నుండి చూసేలా ఎగ్జిబిషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివి మనం సోషల్ మీడియాలో వీడియోల ద్వారా […]

  • Published On:
Hyderabad :  హైదరాబాద్ నడిబొడ్డున అండర్ వాటర్ ఎగ్జిబిషన్..ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా…చాలా చీప్..

Hyderabad  : వేసవికాలంలో హైదరాబాద్ నగరవాసులు రకరకాల ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు పెద్దలు కుటుంబంతో కలిసి పర్యాటక స్థలాలకు వెళ్లి కుటుంబంతో ఆహ్లాదంగా గడుపుతుంటారు. అలాంటి నగరవాసుల కోసం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఓ అద్భుతం కనువిందు చేస్తుంది. అయితే విదేశాల్లో నీటి లోపల టన్నెళ్లను ఏర్పాటు చేసి దానిలో నుండి వివిధ రకాల చేపలను దగ్గర నుండి చూసేలా ఎగ్జిబిషన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివి మనం సోషల్ మీడియాలో వీడియోల ద్వారా చాలానే చూసాం.

underwater-exhibition-in-hyderabad-do-you-know-the-entry-fee-very-cheap

ఇక అలాంటి అద్భుతం ఒకటి ఇప్పుడు హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున కనువిందు చేస్తుంది. హైదరాబాద్ నగరవాసులు వేసవికాలంలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఆక్వా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ ను కూకట్ పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం రోజు దీనిని ప్రారంభించగా… మరో రెండు నెలలు ఇది అందుబాటులో ఉండనుందని సమాచారం. అంతేకాక ఇక్కడ ఎంట్రీ ఫీ చాలా తక్కువ.

underwater-exhibition-in-hyderabad-do-you-know-the-entry-fee-very-cheap

ఒక్కరికి కేవలం 100 రూపాయలు చొప్పున తీసుకుంటూ అండర్ వాటర్ ఎగ్జిబిషన్ ను చూసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఇలాంటివి మనం దాదాపుగా టీవీ లో లేదా మొబైల్ ఫోన్ లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఈ అద్భుతమైన దృశ్యాలను డైరెక్ట్ గా చూసేందుకు అవకాశం దొరకడంతో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ టన్నెల్ ను ఏర్పాటు చేసేందుకు దాదాపుగా ఆరు నెలల సమయం పట్టినట్లు గా నిర్వాహకులు తెలియజేశారు. మీరు కూడా హైదరాబాద్ మహానగరంలో ఉండి ఉంటే ఒకసారి వెళ్లి ఈ అండర్ ఎగ్జిబిషన్ ను వీక్షించండి.