Viral Video : ముగ్గురిని బైక్ మీద తీసుకెళ్ళేందుకు ఈ వ్యక్తి ఎంత పని చేసాడో చూడండి…వైరల్ వీడియో…

Viral Video : కొందరు ప్రయాణ సమయంలో ఎలాగైనా గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన సాహసాలకు పాల్పడుతున్నారు. రైలు ప్రయాణాల్లో అయితే డోర్ వద్ద ఇరుక్కుని వెళ్లడం, ఆటోలకు వేలాడుతూ మరి ప్రయాణం చేయడం, ఓకే బైక్ మీద నలుగురైదుగురు కలిసి వెళ్లడం, ఇలా వివిధ రకాలుగా విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో కొందరు తెలివితేటలు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

  • Published On:
Viral Video : ముగ్గురిని బైక్ మీద తీసుకెళ్ళేందుకు ఈ వ్యక్తి ఎంత పని చేసాడో చూడండి…వైరల్ వీడియో…

Viral Video : కొందరు ప్రయాణ సమయంలో ఎలాగైనా గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవాలనే ఉద్దేశంతో చిత్రవిచిత్రమైన సాహసాలకు పాల్పడుతున్నారు. రైలు ప్రయాణాల్లో అయితే డోర్ వద్ద ఇరుక్కుని వెళ్లడం, ఆటోలకు వేలాడుతూ మరి ప్రయాణం చేయడం, ఓకే బైక్ మీద నలుగురైదుగురు కలిసి వెళ్లడం, ఇలా వివిధ రకాలుగా విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో కొందరు తెలివితేటలు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అయితే ఇలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఇద్దరు మహిళలు బైక్ మీద వెళ్లేందుకు స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని మరి ప్రయాణం చేస్తున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్ ను నడుపుతుండగా అతని వెనకనే మహిళ కూర్చుని ఉంది. ఇక బైక్ పై వారిద్దరికీ స్థలం సరిపోవడంతో రెండవ మహిళ కూర్చోడానికి బైక్ మీద స్పేస్ లేదు. అయితే ఎలాగైనా సరే ముగ్గురు కలిసి వెళ్లాలని ఉద్దేశంతో , వారు వినూత్నంగా ఆలోచించారు. దీంతో వ్యక్తి వెనుక కూర్చున్న మహిళ , తనపై మరో మహిళను కూర్చోపెట్టుకుంది. ఇలా ముగ్గురు కలిసి ఒకే బైక్ పై వెళ్తుండగా వెనకనే వస్తున్న వాహనదారులు చూసి అవాక్కయ్యారు. ఇక వారి తెలివితేటలు చూసి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నేటిజనులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇలాంటి ప్రయాణం ప్రమాదకరమని సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Candid Vansh (@candidvansh)