Viral Video : ఈ వక్తి మేధస్సుకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే….చేత్తో పట్టుకోకుండానే బోరు లో నుండి నీళ్లను ఎలా రప్పిస్తున్నాడో చూడండి…

Viral Video : మనం మెదడుకు పదును పెడితే చేసే పనిలో శ్రమ తగ్గుతుందని చాలామంది తరచూ నిరూపిస్తూనే ఉన్నారు. చాలామంది వారి మేధస్సును ఉపయోగించిచాలా కష్టం అనుకున్న పనులను కూడా చాలా సులభం చేసే మార్గాలను కనిపెడుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన ఐడియాలు మరియు వీడియోలు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. అలాంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి […]

  • Published On:
Viral Video : ఈ వక్తి మేధస్సుకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే….చేత్తో పట్టుకోకుండానే బోరు లో నుండి నీళ్లను ఎలా రప్పిస్తున్నాడో  చూడండి…

Viral Video : మనం మెదడుకు పదును పెడితే చేసే పనిలో శ్రమ తగ్గుతుందని చాలామంది తరచూ నిరూపిస్తూనే ఉన్నారు. చాలామంది వారి మేధస్సును ఉపయోగించిచాలా కష్టం అనుకున్న పనులను కూడా చాలా సులభం చేసే మార్గాలను కనిపెడుతున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వినూత్న ప్రయోగాలకు సంబంధించిన ఐడియాలు మరియు వీడియోలు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి. అలాంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి . అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తెలివిని ఉపయోగించి బోరు పంపును పట్టుకోకుండానే నీళ్లను బయటకు రప్పించాడు. అసలు ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది కదా ….అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే….

అయితే ఈ వీడియోను upender verma అనే ఇంస్టాగ్రామ్ యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిని ఉపయోగించి నీళ్లను బయటకు తోడే సాధారణ బోరు ను ఎలక్ట్రిక్ బోరుగా మార్చేశాడు. ఒక్క స్విచ్ నొక్కితే చాలు ఆటోమేటిక్ గా నీళ్లు బయటకు వచ్చేలా దీనిని తయారు చేశాడు. ఇక దీనికోసం అతను పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదు. దీనిని తయారు చేసేందుకు ఆ వ్యక్తి కేవలం ఓ సైకిల్ చైన్ మరియు ఎలక్ట్రిక్ వైర్లు మరియు స్విచ్ చిన్న మోటార్ ను మాత్రమే ఉపయోగించాడు. బోరు హ్యాండిల్ ను పైపు సహాయంతో సైకిల్ పెడల్ కు అనుసంధానం చేశాడు. ఇక దానికి ఎలక్ట్రిక్ వైర్లతో స్విచ్ మరియు మోటర్ ను కనెక్ట్ చేశాడు.

దీంతో స్విచ్ ఆన్ చేయగానే సైకిల్ పెడల్ తో పాటు అనుసంధానం చేసి ఉన్న బోరింగ్ హ్యాండిల్ కూడా ఆటోమేటిక్ గా పైకిి కిందికి వెళ్తూ వస్తుంది. తద్వారా బోరింగ్ లోని నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి మేధస్సు కు ప్రతి ఒక్కరు ఫీదా అవుతున్నారు. ఇలాంటి వారికి అవకాశం కల్పిస్తే మరెన్నో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోను ఇప్పటిదాకా 30 లక్షల మంది వీక్షించగా, 4.25 లక్షల మంది లైక్స్ కొట్టారు. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులు ఇలాంటి ఐడియాలు మన భారతీయులకు వస్తాయని, ఈ ఆలోచనను మన దేశం దాటి వెళ్ళనివ్వకూడదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Upendra Verma (@upe_n_draverma)