Viral Video : సీసీటీవీ ఫుటేజ్ తో బయటపడ్డ అసలు నిజం…ముంబై లోకల్ ట్రైన్ లో విద్యార్ధినిలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపులు గురించి చాలా వీడియోలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుంటున్నారు. అయితే తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని […]

  • Published On:
Viral Video : సీసీటీవీ ఫుటేజ్ తో బయటపడ్డ అసలు నిజం…ముంబై లోకల్ ట్రైన్ లో విద్యార్ధినిలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు..

Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపులు గురించి చాలా వీడియోలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుంటున్నారు. అయితే తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురి అయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేశారు. మొదటగా ఆ నిందితుడు నవాజ్ కరీం షేక్ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది.

 

అయితే బాధితులు ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వీడియోలో నవాజ్ మోచేతితో ఓ మహిళను అనుచితంగా తాకినట్లు కనిపిస్తుంది. మరి కొన్ని వీడియోల్లో నవాజ్ మరో ఇద్దరు మహిళ ప్రయాణికులను తాకేందుకు ప్రయత్నించగా వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నట్లు కనిపించింది. అయితే ఆ నిందితుడు బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ మసీదు స్టేషన్ల మధ్య ఒక విద్యార్థిని లోకల్ ట్రైన్ లో ఇంటికి వెళుతుండగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

రాత్రి సమయం కావడంతో కంపార్ట్మెంట్లో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా విద్యార్థినిపై కరీం షేక్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ బృందాలు టెక్నాలజీతో సిసి ఫుటేజ్ ను చెక్ చేశారు. నిందితుడిని గుర్తించి బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అయితే కరీం షేక్ ఆ ఒక్కరోజు ఐదుగురు మహిళలను లైంగికంగా వేధించినట్లు సిసిటీవీ ఫుటేజ్ లో కనిపించింది. చివరికి విద్యార్థిని పోలీస్ లకు చెప్పడంతో దొరికిపోయాడు.