Gold Price : మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధర..

Gold Price  :  ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర విపరీతంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ నెల ప్రారంభంలో భారీగా తగ్గిన బంగారం ధర ఇటీవల తిరిగి పుంజుకుని మార్కెట్లో విపరీతంగా దూసుకుపోతోంది. దీంతో ప్రస్తుతం బంగారం ధర 59 వేల రూపాయల దిగువ కొనసాగుతోంది. కానీ మార్కెట్లో మాత్రం నిపుణుల అంచనాలు మరోలా ఉన్నాయి. కాగా ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు బంగారం ధర వివరాలు […]

  • Published On:
Gold Price : మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధర..

Gold Price  :  ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర విపరీతంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ నెల ప్రారంభంలో భారీగా తగ్గిన బంగారం ధర ఇటీవల తిరిగి పుంజుకుని మార్కెట్లో విపరీతంగా దూసుకుపోతోంది. దీంతో ప్రస్తుతం బంగారం ధర 59 వేల రూపాయల దిగువ కొనసాగుతోంది. కానీ మార్కెట్లో మాత్రం నిపుణుల అంచనాలు మరోలా ఉన్నాయి. కాగా ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు బంగారం ధర వివరాలు ఇలా ఉన్నాయి.

 The price of gold is increasing in the market.

నిన్న దేశవ్యాప్తంగా మార్కెట్లో బంగారం లాభాలను తెచ్చిపెట్టింది. నిన్న (అక్టోబర్ 10 )ఉదయం రూ.58,200 వద్ద ప్రారంభమైన బంగారం ధర రూ.58,330 రూపాయల వరకు పెరిగింది. ఇక సాయంత్రానికి ఇది రూ.58,530 క్లోసింగ్ ను నమోదు చేసింది. ఈ నేపద్యంలో ఈరోజు 24క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 గా కొనసాగుతుంది. అంతేకాక ఈరోజు కూడా గోల్డ్ రేటు పెరుగుదలను నమోదు చేస్తున్నట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో గడిచిన గత ఐదు రోజుల్లోనే దాదాపు1300 వరకు బంగారం ధర పెరిగింది.

ఇక హైదరాబాద్ , విజయవాడ ,బెంగళూరు మరియు కలకత్తా వంటి ముఖ్య నగరాలలో కూడా ఈరోజు బంగారం ధర ఇదేవిధంగా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ విషయానికొస్తే…10 గ్రాముల బంగారం ధర రూ.53,650 వద్ద కొనసాగుతుంది. ఇక ఈ నెలలో గోల్డ్ మార్కెట్ 8 నెలల కనిష్టాన్ని చవిచూసింది. అనంతరం పుంజుకున్న గోల్డ్ మార్కెట్ 60 వేల మార్కు వైపుగా పరుగులు తీస్తోంది. అయితే అక్టోబర్ 5న రూ.57,160 వద్ద కొనసాగిన గోల్డ్ రేట్ ఈరోజు రూ.58,530 వద్ద కొనసాగుతూ వస్తుంది.

గమనిక : మార్కెట్లో గోల్డ్ రేట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.అలాగే ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ కి మార్పులు ఉంటాయని గమనించగలరు.