Viral News : ముగ్గురు వ్యక్తుల ఆకతాయి చేష్టలు…ఆగ్రహించిన ఏనుగులు ఏం చేసాయో చూడండి…

Viral News : కొంతమంది చేసే కొన్ని ఆకతాయి చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకే వస్తుంటాయి. మరి ముఖ్యంగా జంతువుల విషయంలో ఎలాంటి ఆకతాయి పనులు చేయకూడదు. అలా కాదని జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటికి చిరాకు తెప్పించే పనులు చేస్తే వాటి రియాక్షన్ మామూలుగా ఉండదు మరి. అందుకే జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా…ప్రస్తుతం […]

  • Published On:
Viral News : ముగ్గురు వ్యక్తుల ఆకతాయి చేష్టలు…ఆగ్రహించిన ఏనుగులు ఏం చేసాయో చూడండి…

Viral News : కొంతమంది చేసే కొన్ని ఆకతాయి చేష్టలు అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకే వస్తుంటాయి. మరి ముఖ్యంగా జంతువుల విషయంలో ఎలాంటి ఆకతాయి పనులు చేయకూడదు. అలా కాదని జంతువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటికి చిరాకు తెప్పించే పనులు చేస్తే వాటి రియాక్షన్ మామూలుగా ఉండదు మరి. అందుకే జంతువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా…ప్రస్తుతం ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముగ్గురు వ్యక్తులు అడవి ఏనుగులతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేసి వాటిని ఆగ్రహానికి గురి చేశారు.

దీంతో మండిపోయిన గజరాజులు వారి వెంటపడి ముగ్గురిని ఉరికించాయి. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇక ముగ్గురిలో ఒక వ్యక్తి అదుపు తప్పి కింద పడి మరలా లేచి పరుగందుకున్నాడు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులు ఏనుగుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు .దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . వైరల్ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.  అయితే ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు నేపాల్ కు వెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో వారు అడవి బాటకుండా దుద్వా టైగర్ రిజర్వ్ నుండి వెళ్తుండగా అక్కడ వారికి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో వారు చేతిలో సెల్ ఫోన్స్ పట్టుకొని సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. అంతేకాక వాటి దగ్గరికి వెళ్లి దగ్గర నుండి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశారు. దీంతో వారు చేష్టలకు చిర్రెత్తిపోయిన ఏనుగులు ఒక్కసారిగా ఆ ముగ్గురు వ్యక్తుల వైపు దూసుకొచ్చాయి. దీంతో వనికిపోయిన ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పరుగులు తీశారు. అలా ఏనుగుల భారీ నుంచి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.