Viral Video : జాతి వేరైనా ఈ మూగజీవుల ప్రేమ మాత్రం వర్ణించలేనిది …వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి…

Viral Video : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కుక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. తమ ఇంట్లో సభ్యుల మాదిరిగా కుక్కలను పెంచుకుంటారు. ప్రస్తుత కాలంలో అయితే కుక్కలకు పుట్టినరోజులు కూడా చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ విదేశీ కుక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ వీధి కుక్కలకు మాత్రం ఎవరు దగ్గరికి తీసుకోవడం లేదు. దీనివలన వీధి కుక్కలు విధుల్లోనే ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. అంతేకాక కొన్ని కుక్కలు వాహన చక్రాల కింద పడి , […]

  • Published On:
Viral Video : జాతి వేరైనా ఈ మూగజీవుల ప్రేమ మాత్రం వర్ణించలేనిది …వీటిని చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాలి…

Viral Video : ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కుక్కలను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. తమ ఇంట్లో సభ్యుల మాదిరిగా కుక్కలను పెంచుకుంటారు. ప్రస్తుత కాలంలో అయితే కుక్కలకు పుట్టినరోజులు కూడా చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ విదేశీ కుక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ వీధి కుక్కలకు మాత్రం ఎవరు దగ్గరికి తీసుకోవడం లేదు. దీనివలన వీధి కుక్కలు విధుల్లోనే ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాయి. అంతేకాక కొన్ని కుక్కలు వాహన చక్రాల కింద పడి , మరికొన్ని ఆకలితో చనిపోతున్నాయి. ఇది మన భారతదేశంలోని ఎక్కువగా కనిపిస్తుంది.

దీనిని పరిశీలిస్తే విదేశీ జాతి కుక్కల జీవితం.. వీధి కుక్కల జీవితం మధ్య వ్యత్యాసం మాటల్లో చెప్పలేనిది. అయితే ఇటీవల వీధి కుక్కలతో విదేశీ పెంపుడు కుక్కల స్నేహానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సైబీరియన్ హస్కి, గోల్డెన్ రిట్రివర్ జాతి కుక్కలు కారులో ఉన్నాయి. అదే సమయంలో ఆ కారు వద్దకు వీధి ఒక్క వచ్చి నిలబడింది. అంతేకాక ఆ జాతి కుక్కలను చేరుకునేందుకు వీధి కుక్క కారుపై ఎక్కెందుకు ప్రయత్నిస్తుంది. జాతి కుక్కలు కూడా తోక ఊపుతూ కారు కిటికీలోంచి తొంగి చూస్తున్నాయి. తన పాదాలతో కారులో ఉన్న కుక్కలను తాకుతూ, నాలుక తో నాకుతూ వీధి కుక్క ప్రేమను తెలియజేస్తుంది.

వీధి కుక్క ప్రేమను ఖరీదైన కుక్కలు కూడా ఇష్టపడినట్లు అర్థమవుతుంది. ఇక ఈ వీడియోను అక్కడే ఉన్నా విదిత్ శర్మ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రజలు విదేశీ కుక్కలను పెంచుకుంటూ మన భారతీయ వీధి కుక్కలను విస్మరిస్తున్నారని , ఈ సన్నివేశం చూసాక నా మనసు బాధ పడిందంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇలాంటి పరిస్థితులను మార్చాలని వీధి కుక్కలకు కూడా తగిన ప్రేమ సంరక్షణ ను అందించాలని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వీడియో నేటి జనుల లను నహా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో చూసిన నేటి జనులు వీధి కుక్కల పట్ల బాధను వ్యక్తం చేస్తున్నారు. వాటిని కూడా సరిగ్గా సంరక్షిస్తే మనుషులపై, పిల్లలపై క్రూరంగా ప్రవర్తించవు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.