Singer Sunitha : సింగర్ సునీత భర్తకు అపరిచిత వ్యక్తి బెదిరింపులు…పోలీసులకు ఫిర్యాదు చేయగా…

Singer Sunitha : సినీ పరిశ్రమలో ప్రముఖ సింగర్ సునీత కొన్నేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామకృష్ణ వీరపనేని అనే వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీతో సునీత చాలా సంతోషంగా ఉంటుంది. అయితే రామకృష్ణకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మరియు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయాట. ఇదిలా ఉండగా ఇటీవల సునీత భర్త రామకృష్ణను ఓ వ్యక్తి బెదిరింపులకు గురి చేశాడు. దీంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను […]

  • Published On:
Singer Sunitha : సింగర్ సునీత భర్తకు అపరిచిత వ్యక్తి బెదిరింపులు…పోలీసులకు ఫిర్యాదు చేయగా…

Singer Sunitha : సినీ పరిశ్రమలో ప్రముఖ సింగర్ సునీత కొన్నేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామకృష్ణ వీరపనేని అనే వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది. ఇక ఇప్పుడు తన ఫ్యామిలీతో సునీత చాలా సంతోషంగా ఉంటుంది. అయితే రామకృష్ణకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ మరియు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయాట. ఇదిలా ఉండగా ఇటీవల సునీత భర్త రామకృష్ణను ఓ వ్యక్తి బెదిరింపులకు గురి చేశాడు. దీంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి జరిగింది చెప్పి ఫిర్యాదు చేశాడు. ఓ వ్యక్తి తనకు పదే పదే ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని,

singer-sunitas-husband-was-threatened-by-a-stranger

అతని నుండి నాకు ప్రాణహాని ఉందని రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం…ఫోన్ చేసిన కేకే లక్ష్మణ్ అనే వ్యక్తి సినిమా నిర్మాతల కౌన్సిల్ సభ్యుడిని అంటూ సుజాత భర్త రామకృష్ణకు పదేపదే మెసేజెస్, కాల్స్ చేసి వ్యక్తిగతంగా కలవాలని కోరాడట. అపరిచిత వ్యక్తి కావడంతో రామకృష్ణ వ్యక్తిగతంగా కలవడానికి నిరాకరించాడు. ఏదైనా బిజినెస్ వ్యవహారం గురించి మాట్లాడాలనుకుంటే ముందుగా తన టీం ని కలవమని అతనికి రామకృష్ణ చెప్పాడట.

singer-sunitas-husband-was-threatened-by-a-stranger

అయినా వినకుండా ఆ వ్యక్తి పదే పదే రామకృష్ణకు కాల్స్ మెసేజెస్ చేస్తూ ఇబ్బంది పెట్టడంతో రామకృష్ణ అతని నెంబర్ ను బ్లాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయినా సరే ఆ వ్యక్తి నెంబర్ మార్చి మళ్లీ కాల్స్ మెసేజ్ చేయడం మొదలు పెట్టాడట. అంతేకాక బెదిరింపులకు పాల్పడడంతో ఇటీవల రామకృష్ణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేకే లక్ష్మణ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే రామకృష్ణ తన వద్ద ఉన్న ఫోన్ కాల్స్ లిస్ట్ మరియు మెసేజ్ లను పోలీసులకు ఇవ్వడం జరిగింది. రామకృష్ణ ఇచ్చిన ఆధారాల మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.