TSRTC : సంక్రాంతి పండుగ వేళ మహిళలకు ఆర్టీసీ భారీ షాక్…

TSRTC  : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ఖుషిగా ఉన్నారు. దీంతో ఆధార్ కార్డును చేతిలో పట్టుకొని ఎటు వెళ్లాలనుకుంటే అటు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. మరికొందరైతే ఇంట్లో టైం పాస్ కాక చేతిలో ఆధార్ కార్డు పట్టుకొని సరదాగా బస్సులో తిరిగి వస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు సరిపోక తాజాగా తెలంగాణ […]

  • Published On:
TSRTC : సంక్రాంతి పండుగ వేళ మహిళలకు ఆర్టీసీ భారీ షాక్…

TSRTC  : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ఖుషిగా ఉన్నారు. దీంతో ఆధార్ కార్డును చేతిలో పట్టుకొని ఎటు వెళ్లాలనుకుంటే అటు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. మరికొందరైతే ఇంట్లో టైం పాస్ కాక చేతిలో ఆధార్ కార్డు పట్టుకొని సరదాగా బస్సులో తిరిగి వస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు సరిపోక తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో 80 కొత్త బస్సులను తీసుకొచ్చింది . ఇంకా కొన్ని కొత్త బస్సులు తెచ్చా సూచనలు కూడా ఉన్నాయట. అయితే దగ్గరలో సంక్రాంతి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ యాజమాన్యం మహిళలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగకు ఫ్రీగా బస్సులలో ఊర్లకు పోవచ్చు అని సంతోషించే మహిళలకు ఇది ముఖ్యమైన గమనిక అని చెప్పాలి. ఫ్రీగా బస్సులో వెళ్లే ముందు పర్సులో కాసిన్ని డబ్బులు పెట్టుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోమంటే పరేషాన్ అవుతరు మల్ల . అగొ అదేంది బస్సులన్నీ ఫ్రీ అని చెప్పారు కదా..మళ్లీ టికెట్ కొట్టుడు ఏంది అని అనుకుంటున్నారా.. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన బస్సులలో అసలు ఖాళీ ఉండటం లేదు. ఇక పండుగలు వచ్చాయంటే చాలామంది ఆడోళ్ళు మొగోళ్ళు పండుగలకు ఊర్లకు పోతారు.  మరి అలా వెళ్లే వారందరికీ తిప్పలు కాకుండా ఉండాలంటే ఈ ఫ్రీ బస్సు పథకాన్ని పండగ పూట తీసేయాలని ఆలోచన చేస్తున్నారట ఆర్టీసీ యాజమాన్యం.

ఇప్పటికే టికెట్ కొనుక్కొని నిలుచుని పోతున్నాం, ఆడవాళ్లు మాత్రం ఫ్రీగా సీట్లలో కూర్చొని పోతున్నారు అని అక్కడక్కడ కొందరు మగమహారాజులు కూడా లొల్లి చేయడం ప్రారంభించారు. మరి పండుగ సమయంలో ఇలాంటి పంచాయతీలు ఇంకెన్ని అయితయో ఏమో. అందుకే సంక్రాంతి పండుగ పూట ఈ ఫ్రీ బస్సు పథకాన్ని తీసేసే ఆలోచన చేస్తుంది ఆర్టీసీ. ఇక ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ దగ్గరికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఒక్క పల్లె వెలుగు బస్సులలో తప్ప మిగిలిన అన్ని బస్సుల్లో టికెట్లు కొట్టాలని ఆలోచనలో ఉన్నారట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆర్టీసీ చేసిన ఆలోచనకు సర్కార్ మద్దతు తెలుపుతుందో లేకపోతే ఫ్రీ బస్సు అని చెప్పి పండగ పూట ఆ పథకాన్ని తీసేస్తే మళ్లీ ప్రజలు లొల్లి చేస్తారని ఆలోచనను వెనక్కి తీసుకుంటారో వేచి చూడాలి మరి.