Viral Video : వామ్మో ఇదేం జంతువు….చూస్తేనే భయమేస్తుంది….
Viral Video : మన భూమిపై కొన్ని కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని జీవులు మాత్రమే మనకు తెలుసు. ఇక చాలా రకాల జీవులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల జీవులను మనం చూడగలుగుతున్నాం. ఇక సోషల్ మీడియాలో అలాంటి వింత జీవులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
Viral Video : మన భూమిపై కొన్ని కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని జీవులు మాత్రమే మనకు తెలుసు. ఇక చాలా రకాల జీవులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలియదు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల జీవులను మనం చూడగలుగుతున్నాం. ఇక సోషల్ మీడియాలో అలాంటి వింత జీవులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న ఓ వింత జంతువు చూడడానికే చాలా భయంకరంగా కనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
అయితే ఈ వీడియోను Terrifying Nature అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వింత జంతువు కనిపిస్తుంది. ఇక దాని మొహం కాస్త మనిషిని పోలి ఉండగా పెద్ద కన్నులతో చాలా భయంకరంగా ఉంది. అలాగే నాలుకను బయట పెడుతూ వింతగా ప్రవర్తిస్తుంది. ఇక దాని శరీరం చూస్తే మాత్రం జంతువు లాగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ఎక్కడ ఎప్పుడు తీశారు అనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోని ఇప్పటికే 50 వేలమంది వీక్షించగా…చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి కామెంట్స్ చేస్తున్నారు. బాబోయ్ ఏమిటిది అంటూ కొందరు , ఇది నిజమా లేక గ్రాఫిక్స్ మరికొందరు , దానిని చూస్తుంటేనే భయం వేస్తుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది జన్యుపరమైన లోపం వలన జన్మించిన జీవి అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఇలాంటి వింత జీవిని చూసినప్పుడు స్పందించక ఉండడం కష్టమని చెప్పాలి.
What the hell is this? 😳 pic.twitter.com/lrTvLVNIml
— Terrifying Nature (@JustTerrifying) July 18, 2023