Earthquake : ఢిల్లీలో భారీ భూకంపం….ఊగిపోయిన బిల్డింగ్స్…

Earthquake  : ఈరోజు ఢిల్లీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. బలమైన భూ ప్రకంపనాలతో ఢిల్లీ వాసులు హడలి పోయారు. ఇండ్లలో మరియు ఆఫీసులలో ఉన్న ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం అక్టోబర్ 3 మధ్యాహ్నం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సంభవించినట్లుగా తెలుస్తోంది . ఇక రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. ఇంతటి భారీ భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలంతా ఒక్కసారిగా […]

  • Published On:
Earthquake : ఢిల్లీలో భారీ భూకంపం….ఊగిపోయిన బిల్డింగ్స్…

Earthquake  : ఈరోజు ఢిల్లీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. బలమైన భూ ప్రకంపనాలతో ఢిల్లీ వాసులు హడలి పోయారు. ఇండ్లలో మరియు ఆఫీసులలో ఉన్న ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం అక్టోబర్ 3 మధ్యాహ్నం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో సంభవించినట్లుగా తెలుస్తోంది . ఇక రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.6 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. ఇంతటి భారీ భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలంతా ఒక్కసారిగా భయంతో వనికి పోయారు. అయితే ఢిల్లీలోని ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ భూకంపం దాదాపు నిమిషం పాటు వచ్చినట్లు సమాచారం. ఇక ఢిల్లీ తో పాటు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లో కూడా దాదాపు 10 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం రెక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ భూకంపం మధ్యాహ్నం 2: 25 నిమిషాలకు నేపాల్ ను తాకినట్లు వెళ్లడైంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక చాలామంది భూకంపం వచ్చిన సమయంలో వీడియోలను తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. భూకంప దాటికి భయాందోళనకు గురైన ప్రజలు ఇంటి నుండి పరుగులు తీయడం ఆఫీసుల నుండి బయటకు రావడం వీడియోలలో మనం గమనించవచ్చు. అలాగే కొందరు భూకంపం సంబంధించినప్పుడు వారి ఇంట్లో ఊగుతున్న వస్తువులను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలు ప్రకారం చూస్తే ఇది భారి భూకంపం అని చెప్పుకోవాలి.