Viral Video : ప్రేమ జంటలకు శుభవార్త…ఓయో తో పని లేకుండా గదులు అద్దెకి…గంటకు కేవలం రూ.99 మాత్రమే…

Viral Video : ప్రేమికులు ఎక్కువగా ఏకాంతం కోరుకుంటారు. అది పార్క్ అయిన హోటల్ అయినా ప్రత్యేకంగా ఉండాలని ఎవరి డిస్టబెన్స్ ఉండకూడదని భావిస్తుంటారు. దీన్ని క్యాష్ చేసుకొని పలువురు పలు రకాలుగా సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని oyo రూమ్స్ కూడా వచ్చాయి. అయితే ఓయో రూమ్స్ ని తలదన్నేలా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మాస్టర్ ప్లాన్ వేసాడు. కొంచెం భయం కూడా లేకుండా చట్ట వ్యతిరేక పనులు చేస్తూ..చివరకు పోలీసులకు దొరికిపోయాడు.. పూర్తి […]

  • Published On:
Viral Video : ప్రేమ జంటలకు శుభవార్త…ఓయో తో పని లేకుండా గదులు అద్దెకి…గంటకు కేవలం రూ.99 మాత్రమే…

Viral Video : ప్రేమికులు ఎక్కువగా ఏకాంతం కోరుకుంటారు. అది పార్క్ అయిన హోటల్ అయినా ప్రత్యేకంగా ఉండాలని ఎవరి డిస్టబెన్స్ ఉండకూడదని భావిస్తుంటారు. దీన్ని క్యాష్ చేసుకొని పలువురు పలు రకాలుగా సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని oyo రూమ్స్ కూడా వచ్చాయి. అయితే ఓయో రూమ్స్ ని తలదన్నేలా మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు మాస్టర్ ప్లాన్ వేసాడు. కొంచెం భయం కూడా లేకుండా చట్ట వ్యతిరేక పనులు చేస్తూ..చివరకు పోలీసులకు దొరికిపోయాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే…

good-news-for-love-couples-rent-rooms-only-rs-99-per-hour

మధ్యప్రదేశ్ ఇండోర్ లోని చత్రిపుర పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోనే బ్లూ బాటిల్ కేఫ్ అనే పేరుతో ఓ యువకుడు కేఫ్ ను ప్రారంభించాడు. దాని లోపల ప్రేమికులు ఏకాంతంగా గడిపేందుకు క్యాబిన్ లను డిజైన్ చేయించాడు. ఇక వాటిని గంటకు 99 రూపాయల చొప్పున ప్రేమికులకు అద్దెకిస్తూ వస్తున్నాడు. అయితే లోపల ఏం జరుగుతుందో అన్న విషయం ఎవరికీ తెలియకుండా నెట్టుకొచ్చాడు. అందరూ దానిని కేఫ్ కదా అని లైట్ తీసుకున్నారు. కానీ కేఫ్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇలా గత కొంతకాలంగా బ్లూ బాటిల్ కేఫ్ ను కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కేఫ్ లోపలగల వెసులుబాటును అందరికీ తెలిసేలా చేసేందుకు అతనే ఒక వీడియోని రూపొందించాడు. అంతే ఇక ఆ కేఫ్ లో ఏం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిపోయింది.

good-news-for-love-couples-rent-rooms-only-rs-99-per-hour

అంతేకాక స్థానిక ప్రాంతాల నుండి అభ్యంతరాలు రావడం మొదలయ్యాయి. ప్రేమ జంట వారి ప్రైవేట్ క్షణాలకు మా కేఫ్ లో వెసులుబాటు కల్పిస్తున్నాం అన్నట్లుగా , ఎంతసేపైనా మీరిక్కడ కాలక్షేపం చేసుకోవచ్చు అనే రీతిలో ఓ వీడియో తీసి ప్రచారం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసులతో సహా అందరికీ తెలిసింది. దీంతో చత్రిపుర పోలీసులు కేఫ్ ను మొదలెట్టిన యువకుడిని పిలిపించారు.కానీ అసలు బండారం బయటపడడంతో యువకుడు కేఫ్ కు తాళం వేసుకొని అక్కడి నుండి పారిపోయాడు . దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మొత్తం వ్యవహారం చూశాక చట్ట విరుద్ధంగా ఆ యువకుడు చేసిన తెగింపును చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. డబ్బు సంపాదించేందుకు అతను వేసిన ప్లాన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు….

good-news-for-love-couples-rent-rooms-only-rs-99-per-hour