Viral News : ఈ రైతు తెలివిని చూశారా…పొలంలో ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఇలా చేశాడు…ఎందుకో తెలిస్తే…

Viral News : ప్రస్తుతం ఉన్న కాలంలో బాగా చదువుకున్న వారనే తెలివైన వారిగా భావిస్తారు. గొప్ప చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తేనే తెలివైన వాళ్ళు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే సామాన్యుడిలో కూడా ఎంతో అద్భుతమైన తెలివి దాగుంది. ప్రస్తుత కాలంలో రైతులు వారి పంట పొలాల వద్ద చేసుకుంటున్న ఏర్పాట్లను చూసి వాహ అనక తప్పడం లేదు. వారికి చదువు లేనప్పటికీ వారి సమస్యలను వారే అద్భుతమైన తెలివితో పరిష్కరించుకుంటున్నారు. వీటిని చూస్తే […]

  • Published On:
Viral News : ఈ రైతు తెలివిని చూశారా…పొలంలో ట్రాన్స్ ఫార్మర్ పక్కన ఇలా చేశాడు…ఎందుకో తెలిస్తే…

Viral News : ప్రస్తుతం ఉన్న కాలంలో బాగా చదువుకున్న వారనే తెలివైన వారిగా భావిస్తారు. గొప్ప చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేస్తేనే తెలివైన వాళ్ళు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే సామాన్యుడిలో కూడా ఎంతో అద్భుతమైన తెలివి దాగుంది. ప్రస్తుత కాలంలో రైతులు వారి పంట పొలాల వద్ద చేసుకుంటున్న ఏర్పాట్లను చూసి వాహ అనక తప్పడం లేదు. వారికి చదువు లేనప్పటికీ వారి సమస్యలను వారే అద్భుతమైన తెలివితో పరిష్కరించుకుంటున్నారు. వీటిని చూస్తే అసలు వీరికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తున్నాయి అనిపిస్తుంది. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో చేసిన ఏర్పాటుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే రైతు తన పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద తెలివిగా ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. దానిని
చూసి నీటిజనులు షాక్ అవుతున్నారు. వామ్మో ఇతనికి ఇంతటి తెలివి ఎక్కడినుంచి వచ్చింది అంటూ ఆశ్చర్యపోతున్నారు..అసలు విషయంలోకి వెళ్తే… ఓ రైతు తన పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద తెలివిగా ఆలోచించి ఒక స్పీకర్ ను సెటప్ చేశాడు. ఇక దానిలో నుండి పాటలు ప్లే అవుతున్నాయి. అయితే దీనిని చూసిన వారురైతుకి పాటలంటే ఇష్టం అనుకుంటా, సంగీత ప్రియుడేమో అందుకే ఇలా చేశాడు అనుకుంటున్నారు. అయితే అసలు నిజం అది కాదు. ట్రాన్స్ ఫార్మర్ కు మ్యూజిక్ ప్లేయర్ ను కనెక్ట్ చేసి దాని పక్కనే స్పీకర్ ను సెట్ చేసుకున్నాడు.

దీంతో కరెంటు రాగానే ఆటోమేటిక్ గా మ్యూజిక్ ప్లే అయి పాటలు వస్తున్నాయి. అయితే రైతు ఈ స్పీకర్ నుండి వచ్చే పాటలను ఆధారంగా చేసుకుని సకాలంలో మోటర్ వేసి తన పంటకు నీళ్లు పట్టుకోగలుగుతున్నాడు. ఇక ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో yogesh_patidar8877_  అనే ఖాతా నుండి షేర్ చేశారు. “మేము పల్లెటూరి వాళ్ళం తలుచుకుంటే ఏదైనా చేయగలం అని” క్యాప్షన్ మెన్షన్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజనులు రైతు తెలివికి మెచ్చుకుంటున్నారు. కొంతమంది ఇది చాలా ప్రమాదకరమైన ప్రయోగమని ఇలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకంటూ రైతును నిందిస్తున్నారు. మరికొందరు రైతు బాధను అర్థం చేసుకొని కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి సరైన మార్గం అంటూ , ఇది రైతులకు చక్కగా ఉపయోగపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Yogesh Patidar (@yogesh_patidar8877_)