Viral Video : పాము తనకు తానే కాటు వేసుకుంటే ఏమవుతుంది..? ఇలా ఎప్పుడైనా అనుకున్నారా…అయితే ఈ వీడియో చూడండి…

Viral Video : ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో చాలావరకు విషపూరితమైనవే. వీటిలో మరికొన్ని అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి కాటు వేశాయంటే అక్కడికక్కడే ప్రాణాలను వదలడం ఖాయం. అందుకే అలాంటి విషపూరితమైన పాములను పట్టుకునె సమయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వాటి గురించి తెలియకుండా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు పోయినట్లే. అయినా కొన్నిసార్లు వాటి భారిన పడి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, పాము తనకు తానే కాటు […]

  • Published On:
Viral Video : పాము తనకు తానే కాటు వేసుకుంటే ఏమవుతుంది..? ఇలా ఎప్పుడైనా అనుకున్నారా…అయితే ఈ వీడియో చూడండి…

Viral Video : ప్రపంచంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. వాటిలో చాలావరకు విషపూరితమైనవే. వీటిలో మరికొన్ని అత్యంత ప్రమాదకరం. ఒక్కసారి కాటు వేశాయంటే అక్కడికక్కడే ప్రాణాలను వదలడం ఖాయం. అందుకే అలాంటి విషపూరితమైన పాములను పట్టుకునె సమయంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వాటి గురించి తెలియకుండా పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలు పోయినట్లే. అయినా కొన్నిసార్లు వాటి భారిన పడి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా, పాము తనకు తానే కాటు వేసుకుంటే ఏమవుతుంది అని… అయితే ఇలాంటిదే ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఈ పాము వీడియో చూసిన నేటిజనులు ఆశ్చర్యపోతున్నారు. మరికొద్ది నిమిషాల్లో చనిపోబోయే పాము తనకు తానే కాటు వేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే… వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన ఓ పామును కొందరు చంపి దాని తలను వేరు చేసి పక్కన పడేశారు. అయినా కూడా ఆ పాము తోకను ఊపుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయితే పక్కన పడేసిన తలకు మాత్రం ప్రాణం లేనట్లుగానే కనిపిస్తుంది. కానీ మొండం మాత్రం అటు ఇటు తిప్పుతూ చివరికి పాము తల వద్దకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఎవరు ఊహించని ఘటన చోటు చేసుకుంది. పాము తోక దాని తల దగ్గరికి రాగానే…అప్పటిదాకా చలనం లేని తల ఒక్కసారిగా నోరు తెరిచి తన తోకను తానే కాటు వేసుకుంది.

దీంతో పాము తన తల నుండి తప్పించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో తోకను అటూ ఇటూ వేగంగా తిప్పుతూ వదిలించుకునే ప్రయత్నం చేసింది కానీ తన కాటు నుండి తాను తప్పించుకోలేక చివరికి ప్రాణాలను విడిచింది. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ..ఈ వీడియో చూసిన నెటి జనులకు ఒక విషయం మాత్రం క్లారిటీ వచ్చింది. పాము తన మోడం నుండి తలను వేరు చేసిన కూడా కొన్ని నిమిషాల పాటు కాటు వేయగలవని అర్థమైంది. ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు వహించాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వామ్మో ఇలాంటివి చూస్తుంటేనే భయమేస్తుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

https://twitter.com/OTerrifying/status/1671044727875989504