Viral Video : నడిరోడ్డుపై జంట ఓవరాక్షన్…వారు చేసిన పనికి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు..

Viral Video : ఈ మధ్యకాలంలో కొంతమంది చేసే పనులు నవ్వు తెప్పిస్తున్నావు. ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని తాపత్రయంతో విచక్షణ కోల్పోయే వింత వింత పనులు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అనే తేడా లేకుండా వింత వింత పనులు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ యువతి ,యువకుడు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చేసిన పనికి పోలీసులు వారిపై కఠిన […]

  • Published On:
Viral Video : నడిరోడ్డుపై జంట ఓవరాక్షన్…వారు చేసిన పనికి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు..

Viral Video : ఈ మధ్యకాలంలో కొంతమంది చేసే పనులు నవ్వు తెప్పిస్తున్నావు. ఎలాగైనా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని తాపత్రయంతో విచక్షణ కోల్పోయే వింత వింత పనులు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ అనే తేడా లేకుండా వింత వింత పనులు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఓ యువతి ,యువకుడు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చేసిన పనికి పోలీసులు వారిపై కఠిన చర్యలను తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని థానే ఉల్లాస్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.అదే ప్రాంతానికి చెందిన యువత యువకుడు రోడ్డుపై స్కూటీ మీద వెళ్తూ సిగ్నల్ వద్ద ఆగారు.

అంతేకాక ఇద్దరి మధ్యలో బకెట్ నీళ్ళు తీసుకుని స్కూటీ మీదనే స్నానం చేస్తున్నారు. స్కూటీ వెనక కూర్చున్న యువతి , బకెట్లో ఉన్న నీటిని మగ్గుతో తీస్తూ , తనమీద మరియుు యువకుడి మీద పోస్తుంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. అయితే వీరిద్దరూ రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి, బైక్ మీద మామూలుగా వెళ్లడం కష్టంగా ఉంది అని తెలియజేసేందుకు ఇలా చేశారని అర్థమవుతుంది.అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో వైరల్ గా మరి చివరకు పోలీసుల కంటపడింది.

“వి డిసర్వ్ బెటర్ గవర్నమెంట్” అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి నగర పోలీసులకు వీడియో చేరింది. అంతేకాక వారిపై చర్యలు తీసుకోవాలని ఆ అకౌంట్ యూజర్ కోరారు. దీంతో ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం తో పాటు పబ్లిక్ లో న్యూసెన్స్ కు పాల్పడిన కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి చలానా విధించారు. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదట ముంబైకి చెందిన ప్రముఖ యూట్యూబర్ ఆదర్స్ శుక్లా.. ఇదంతా జరిగిన తర్వాత తాను చేసిన పనికి సారీ చెబుతూ ఇంస్టాగ్రామ్ వేదికగా శుక్లా వీడియోను కూడా పోస్ట్ చేశారు.