Viral Video : తన చిన్నారికి సులువుగా కట్టింగ్ చేసేందుకు ఈ తల్లి ఏమి చేసిందో చూడండి…సూపర్ టెక్నిక్ కదా…

Viral Video : చిన్నపిల్లలకు హెయిర్ కట్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ఎవరో ఒకరు వారిని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నప్పటికీ వారు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూ కదులుతూనే ఉంటారు. దీంతో చిన్నారుల తలపై గాయాlu అవుతుంటాయి. అయితే ఎయిర్ కటింగ్ షాప్ లో అయినా ఇంటి దగ్గర అయిన ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారికి ఎయిర్ కటింగ్ […]

  • Published On:
Viral Video : తన చిన్నారికి సులువుగా కట్టింగ్ చేసేందుకు ఈ తల్లి ఏమి చేసిందో చూడండి…సూపర్ టెక్నిక్ కదా…

Viral Video : చిన్నపిల్లలకు హెయిర్ కట్ చేయడం అంటే అంత తేలికైన పని కాదు. ఎవరో ఒకరు వారిని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నప్పటికీ వారు ఏడుపులు, పెడబొబ్బలు పెడుతూ కదులుతూనే ఉంటారు. దీంతో చిన్నారుల తలపై గాయాlu అవుతుంటాయి. అయితే ఎయిర్ కటింగ్ షాప్ లో అయినా ఇంటి దగ్గర అయిన ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చిన్నారికి ఎయిర్ కటింగ్ ట్రిక్ ను ఇటీవల ఓ అమ్మ కనిపెట్టింది. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్ కనిపెట్టిందని చెప్పాలి. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే వాట్ యాన్ ఐడియా సర్జీ అంటూ నోరేళ్లపెట్టాల్సిందే…పూర్తి వివరాల్లోకెళితే… ఓ తల్లి తన చిన్నారికి హెయిర్ కటింగ్ చేసేందుకు వినూత్నంగా ఆలోచించింది. తన మెదడుకు పదును పెట్టి కొత్త పద్ధతిని కనుగొనింది. అయితే చిన్నారికి హెయిర్ కటింగ్ చేసేందుకు ముందుగా ఓ అట్ట బాక్స్ ను తీసుకుంది. ఇక ఆ అట్ట బాక్సులో తన చిన్నారి కదలకుండా కూర్చునే విధంగా ఏర్పాటు చేసింది. చిన్నారి కాళ్లు బయటకు పెట్టుకునే విధంగా కింద రెండు హోల్స్ చేసింది. పైన తల బయటకు వచ్చేలా ఒక హోల్ చేసింది. ఇక ఆ తర్వాత చిన్నారిని ప్యాకింగ్ బాక్స్ లో రెండు కాళ్లు బయటకు వచ్చేలా కూర్చోబెట్టింది.

ఇక ఆ తర్వాత చిన్నారి తల మాత్రమే బయటకు ఉండేలా చేతులు లోపలికి ఉండేలా అట్టముక్కను క్లోజ్ చేసి టేప్ తో క్లోజ్ చేసింది. ఇంకా తర్వాత ట్రిమ్మింగ్ మిషన్ తీసుకుని చక చక చిన్నారికి హెయిర్ కటింగ్ చేసేసింది. ఇలా చేస్తున్న కూడా చిన్నారి ఇబ్బంది పెట్టకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు నవ్వుకుంటున్నారు. తల్లి ఆలోచనకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ అనే వక్తి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.