Balapur Ganesh Laddu : రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ……ఎంతో తెలుసా…?

Balapur Ganesh Laddu  : హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ నో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట కూడా అంతే ఫేమస్. అందుకే గణేష్ నిమజ్జన ఉత్సవాలలో బాలాపూర్ గణేష్ ని లడ్డూను ఎవరు పాడారు..? ఎంతకు పాడారు…? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మార్మొగుతుంది. అయితే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు కోసం భక్తులు పోటీపడ్డారు. గత ఏడాది రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది […]

  • Published On:
Balapur Ganesh Laddu  : రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ……ఎంతో తెలుసా…?

Balapur Ganesh Laddu  : హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ నో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట కూడా అంతే ఫేమస్. అందుకే గణేష్ నిమజ్జన ఉత్సవాలలో బాలాపూర్ గణేష్ ని లడ్డూను ఎవరు పాడారు..? ఎంతకు పాడారు…? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మార్మొగుతుంది. అయితే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు కోసం భక్తులు పోటీపడ్డారు. గత ఏడాది రికార్డులను చెరిపేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది లడ్డూ వేలం పాట. అయితే బాలాపూర్ గణేష్ ని లడ్డూ వేలం పాట ప్రతి సంవత్సరం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తుంది. అయితే గత ఏడాది 24 లక్షల 60 వేలకు రూపాయలకు లడ్డు వేలంపాట జరిగింది. ఇక ఈసారి బాలాపూర్ గణేష్ ని లడ్డూ వేలం పాటలో 36 మంది భక్తులు పాల్గొనగా దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి 27 లక్షలకు లడ్డూని కైవసం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం బాలాపూర్ గణేశుని లడ్డు పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

balapur-ganesh-laddu-at-a-record-price-do-you-know

ఇక వచ్చే ఏడాది నుండి వేలంపాటలో పాల్గొనాలి అనుకునేవారు ఉత్సవ కమిటీకి ముందుగానే తెలియజేయాల్సి ఉంటుందని కమిటీ తీర్మానించారు. గత సంవత్సరం 24 లక్షలు అరవై వేల రూపాయలు వేలం పాట పాడిన వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూనికి కైవసం చేసుకున్నాడు. అయితే ఈయన ఈసారి కూడా వేలంలో పాల్గొనడం జరిగింది.అయితే తొలుత నిర్వాహకులు లడ్డు వేలంపాటను ఐదు లక్షల నుండి ప్రారంభించారు. ఇక బాలాపూర్ లడ్డూ వేలం పాట లో పాల్గొన్న భక్తులు లడ్డువేలం ను అమాంతం పెంచుకుంటూ పోయారు..ఇక చివరిగా దాసరి దయానందరెడ్డి 27 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అయితే గణేష్ ని లడ్డూ వేలంపాట అనగానే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు వెంటనే గుర్తుకు వచ్చేది బాలాపూర్ మాత్రమే.

balapur-ganesh-laddu-at-a-record-price-do-you-know

తెలంగాణ రాజధాని హైదరాబాద్ చివారు బాలాపూర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డుని వేలం పాడటం మొదటిగా ప్రారంభించింది అక్కడే. మొదట ఓ వ్యక్తి బాలాపూర్ లడ్డు 450 కి సొంతం చేసుకున్నారు. ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ లడ్డు వేలం ధర పెరుగుతూ వచ్చింది. ఇలా వందల నుండి ప్రారంభమైన లడ్డు పాట ఇప్పుడు లక్షలలో జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డు తన రికార్డ్ లను తానే బద్దలు కొట్టుకుంటూ ముందుకెళ్తుంది. ఇక బాలాపూర్ లడ్డుని దక్కించుకున్న వారు వారికి చాలా మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. అది వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు గ్రామస్తులకు మేలు కలుగ చేస్తుందని తెలియజేస్తున్నారు. ఆ విశ్వాసం క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాలకు పాకింది. అందుకే ప్రతి ఒక్కరు బాలాపూర్ లడ్డూని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కాంక్షతో లక్షలలో లడ్డు వేలం పాట పాడడానికి కూడా వెనకడుగు వేయడం లేదు.