Shocking Crime : మధ్యప్రదేశ్ లో దారుణం…చెల్లి చేసిన పనికి తల నరికిన అన్న…

Shocking Crime : ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి కత్తితో తన సొంత చెల్లెలి తలను నరికేశాడు. ఇక ఈ దారుణం వారి ఇంట్లోనే జరగడం గమనార్హం. అయితే చెల్లి చేసిన పనికి ఆగ్రహించిన అన్న ఇంతటి క్రురత్వానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా తన చెల్లికి పెళ్లి చేసి భర్తతో అత్తారింటికి పంపించారు. కానీ ఆమె తన భర్తను […]

  • Published On:
Shocking Crime : మధ్యప్రదేశ్ లో దారుణం…చెల్లి చేసిన పనికి తల నరికిన అన్న…

Shocking Crime : ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి కత్తితో తన సొంత చెల్లెలి తలను నరికేశాడు. ఇక ఈ దారుణం వారి ఇంట్లోనే జరగడం గమనార్హం. అయితే చెల్లి చేసిన పనికి ఆగ్రహించిన అన్న ఇంతటి క్రురత్వానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా తన చెల్లికి పెళ్లి చేసి భర్తతో అత్తారింటికి పంపించారు. కానీ ఆమె తన భర్తను వదిలేసి ముస్లిం మతానికి చెందిన వాడితో వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అన్న ఈ దారుణానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది.

అయితే మధ్యప్రదేశ్ లోని భరోడ్ గ్రామానికి చెందిన బద్గు ( 26 ) అనే వ్యక్తికి స్వప్న ( 24) ( పేరు మార్చాం ) అనే చెల్లెలు ఉంది. అయితే నాలుగేళ్ల క్రితమే తన చెల్లికి వివాహం చేసి పంపించారు. ఇక వివాహం అనంతరం ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడపసాగింది. ఈ క్రమంలో 2 ఏళ్ళ క్రితం భర్తను వదిలేసి ప్రియుడుతో లేచిపోయింది. కాగా గత రెండేళ్లుగా లేచిపోయిన ప్రియుడుతోనే జీవితం గడుపుతుంది . ఇక చెల్లి చేసిన పనికి గ్రామంలో పరువు పోవడంతో తన అన్న తీవ్ర అగ్రహానికి లోనయ్యాడు. వారిపై పగ పెంచుకున్న అన్న సరైన సమయం కోసం ఎదురు చూడ సాగాడు.

ఇంతలోనే మూడు రోజుల క్రితం స్వప్న తన తల్లిదండ్రులను చూడడానికి వారి స్వగ్రామానికి వచ్చింది. గత రెండు రోజులుగా వారి తల్లిదండ్రులతో సరదాగా గడుపుతూ వస్తుంది. అయితే మూడవరోజు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి తన చెల్లెలి తలను నరికేశాడు. ఇక బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులు కూతురి మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బద్గు ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్న నేటిజన్స్ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.