Hyderabad : హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలా లేక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా..అయితే ఇది మీకోసమే..

Hyderabad : సొంత ఇళ్లు వాకిళ్ళని వదిలి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఇలా వచ్చి ఉద్యోగాలు చేసే వారికి నగరంలో ప్రధానమైన అవసరం ఇల్లు. నగరంలో సొంత ఇల్లు ఉంటే ఇక ఎలాంటి డొక ఉండదు. అయితే హైదరాబాదులో ఇల్లు కొనడం అంటే అంత ఆషామాసి విషయం కాదు. ఇంకా ప్రైమ్ ఏరియాలో అయితే కోట్లు పెట్టిన దొరుకుతుందో దొరకదో తెలియదు. ఇక కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రాంతాలలో […]

  • Published On:
Hyderabad : హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకోవాలా లేక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా..అయితే ఇది మీకోసమే..

Hyderabad : సొంత ఇళ్లు వాకిళ్ళని వదిలి నగరానికి వచ్చి ఉద్యోగాలు చేసేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. ఇలా వచ్చి ఉద్యోగాలు చేసే వారికి నగరంలో ప్రధానమైన అవసరం ఇల్లు. నగరంలో సొంత ఇల్లు ఉంటే ఇక ఎలాంటి డొక ఉండదు. అయితే హైదరాబాదులో ఇల్లు కొనడం అంటే అంత ఆషామాసి విషయం కాదు. ఇంకా ప్రైమ్ ఏరియాలో అయితే కోట్లు పెట్టిన దొరుకుతుందో దొరకదో తెలియదు. ఇక కొంచెం అటు ఇటుగా ఉన్న ప్రాంతాలలో లక్షలు పెట్టి కొనాల్సిందే.

అయితే హైదరాబాదులో ఇల్లు కావాలనుకునేవారు అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకోవడం మంచిదా లేక ఇండిపెండెంట్ ఇల్లును తీసుకోవడం మంచిదా అని డౌట్ అందరిలో ఉంటుంది. దీనిలో ఏది ప్లస్ అనేది సరిగ్గా చెప్పలెం. ఎందుకంటే రెండింటిలో కొన్ని ప్లస్ లు కొన్ని మైనస్లు ఉన్నాయి. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ ఓ ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకునేవారు కాస్త డబ్బులు ఎక్కువైనా సరే ఇండిపెండెంట్ ఇల్లును తీసుకోవడం ఉత్తమం. ఇక అపార్ట్మెంట్ విషయానికి వస్తే వాటిలో లాభాలు నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే వచ్చే సమస్యలు….

1 . మొక్కలను పెంచుకోవాలని కోరిక ఉన్నవారు ప్లాట్స్ లో మొక్కలను పెంచుకోవడానికి వీలు ఉండదు. ఉన్న కూడా చాలా తక్కువ స్పేస్ ఉంటుంది.

2. అలాగే ప్లాట్స్ లో ఇరుగు పొరుగు వాళ్ళతో కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు. మనం ఎంత మంచిగున్నప్పటికీ అవతల వ్యక్తులు సరిగా లేకపోతే ఇబ్బందులు కచ్చితంగా వస్తాయి కదా.

3. ప్లాట్స్ లో మెయింటెనెన్స్ చార్జి లు కట్టడం తప్పనిసరి. మీరు కొన్నింటిని వినియోగించిన వినియోగించకపోయిన చార్జీలు తప్పనిసరిగా కట్టాలి.

4. ఇంటికి ఎక్కువగా బంధువులు కానీ స్నేహితులు కాని వస్తే ఇరుగు పొరుగు వాళ్ల చాడీలకు కొదవ ఉండదు. వెంటనే ఈ వ్యవహారాన్ని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కు చెప్పేస్తారు.

5. అలాగే పెట్ యానిమల్స్ పెంచే విషయంలో కొన్ని నిబంధనలు ఉంటాయి.

6.మన వాహనాలను మనకు కేటాయించిన స్థలంలో మాత్రమే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రెండు కార్లు కలిగి ఉన్నవారికి కొంచెం ఇబ్బంది అని చెప్పాలి.

7. ఇంట్లో మనకు నచ్చినట్టుగా అదనపు కన్స్ట్రక్షన్లో చేయడం ఏమాత్రం కుదరదు.

 

అపార్ట్మెంట్లో ఉండే సౌకర్యాలు..

1. ఇరుగు పొరుగు వారు మంచివారైతే ఏదైనా సమస్యలలో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.

2. వినాయక చవితి, నవరాత్రి లాంటి పండుగలను పల్లెటూర్లో మాదిరిగా అందరు కలిసి చేసుకోవచ్చు.

3. పిల్లలు అందరు కలిసి ఆడుకోవడానికి వీలుగా ఉంటుంది.

8. ఇంటికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది.

9. అన్నిటిలో షేర్ ఉంటుంది కాబట్టి కొంత డబ్బు భారం తగ్గుతుంది.

దీనికి బదులుగా ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుంటే పైన చెప్పుకున్న అంశాలన్నీ రివర్స్ అవుతాయి. మనవాళ్లు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు పోవచ్చు. అలాగే పెరట్లో మొక్కలను పెంచుకోవచ్చు. అంతేకాక మంచి పార్కింగ్ స్పేస్ దొరుకుతుంది. ఇంట్లో మనకేదైనా అదనంగా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనిపిస్తే చేయించుకోవచ్చు.