Anand Devarakonda – Vaishnavi Chaitanya : మరోసారి జతకట్టనున్న ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య…

Anand Devarakonda – Vaishnavi Chaitanya : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఇటీవల హీరో హీరోయిన్ గా నటించిన సినిమా బేబీ. అయితే ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆడియోన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు భారీ కలెక్షన్లను తెచ్చిపెట్టింది. దీంతో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య రాత్రికి రాత్రే […]

  • Published On:
Anand Devarakonda – Vaishnavi Chaitanya : మరోసారి జతకట్టనున్న ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య…

Anand Devarakonda – Vaishnavi Chaitanya : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరియు యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఇటీవల హీరో హీరోయిన్ గా నటించిన సినిమా బేబీ. అయితే ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆడియోన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు భారీ కలెక్షన్లను తెచ్చిపెట్టింది. దీంతో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య రాత్రికి రాత్రే పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్టేజ్ కు వచ్చాను అంటూ ఎమోషనల్ కూడా అయ్యారు.

Anand Devarakonda, Vaishnavi Chaitanya coming together | cinejosh.com

ఇది ఇలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది. ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య కలిసి మరో సినిమాలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.  ఇక ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా పోస్టర్ ను గమనించినట్లయితే కన్నింటి పరవంతమైన వైష్ణవిని ఆనంద్ ఓదారుస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఒక భిన్నమైన ప్రేమ కథను సూచిస్తుందని తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

అలాగే ఈ సినిమాను 2024 సమ్మర్ హాలిడేస్ కు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే తెరపై మరోసారి ఆనంద్ వైష్ణవిని చూసేందుకు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తారో వేచి చూడాలి. వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే మాత్రం కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవటం ఖాయం అనిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుతుంది. ఇక ఈ వార్తలు నిజమైనట్లయితే రష్మిక విజయ్ జంట కు ఎలాంటి క్రేజ్ ఉందొ వీరికి కూడా అలాంటి క్రేజ్ వస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.