Viral News : కరెంట్ బిల్ ఆదా చేసేందుకు వినూత్న ప్రయోగం….ఒక్క ఫ్యాన్ తో మిగతా రెండు కూడా తిరిగేలా ….

Viral News : అవసరం అనేది సరికొత్త ఆలోచనలకు పునాది కల్పిస్తుంది. వ్యక్తి యొక్క తెలివిని మేధస్సును ఉపయోగించేలా చేసి సృజనాత్మకంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేసేలా చేస్తుంది. మరి ముఖ్యంగా మన భారతీయులకు ఇలాంటి కళాపోషణ ఎక్కువ అని చెప్పాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు చేయగలిగే వాటిని తయారు చేసేందుకు భారతీయులు ఎప్పుడు ముందుంటారు. అయితే ఇలాంటి వీడియోలను ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. అలాంటి వీడియోలు చూసిన ప్రతిసారి ఇలాంటి ఐడియాలు […]

  • Published On:
Viral News : కరెంట్ బిల్ ఆదా చేసేందుకు వినూత్న ప్రయోగం….ఒక్క ఫ్యాన్ తో మిగతా రెండు కూడా తిరిగేలా ….

Viral News : అవసరం అనేది సరికొత్త ఆలోచనలకు పునాది కల్పిస్తుంది. వ్యక్తి యొక్క తెలివిని మేధస్సును ఉపయోగించేలా చేసి సృజనాత్మకంగా ఆలోచించి సరికొత్త ఆవిష్కరణలు చేసేలా చేస్తుంది. మరి ముఖ్యంగా మన భారతీయులకు ఇలాంటి కళాపోషణ ఎక్కువ అని చెప్పాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు చేయగలిగే వాటిని తయారు చేసేందుకు భారతీయులు ఎప్పుడు ముందుంటారు. అయితే ఇలాంటి వీడియోలను ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తున్నాం. అలాంటి వీడియోలు చూసిన ప్రతిసారి ఇలాంటి ఐడియాలు అసలు ఎలా వస్తున్నాయో అంటూ ఆశ్చర్యపోక మానరు..

Fan Jugaad 3 Ceiling Fans Spin on 1 Motor Bihar Engineer Jugaad Viral - वीज बिल वाचवण्यासाठी भन्नाट जुगाड, तरुणानं बनवली अशी मोटर जी एकाच वेळी चालवते ३ पंखे | Maharashtra Times

అయితే తాజాగా ఇలాంటి మరో వీడియో నెట్టింటా హల్చల్ చేస్తుంది. ఒక వ్యక్తి తన ఇంట్లో కరెంట్ బిల్లును తగ్గించేందుకు వినూత్నంగా ఆలోచించి సరికొత్త టెక్నిక్ ను కనుగొన్నారు. అయితే ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ఓ ఇంజనీర్ ఒక స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు తిరిగేలా తయారుచేసాడు. అంటే ఒక్క మోటార్ తో మూడు సీలింగ్ ఫ్యాన్లను కనెక్ట్ చేశాడు అన్నమాట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ ఫోటోలో మూడు సీలింగ్ ఫ్యాన్ కొంచెం దూరం దూరంగా కనిపిస్తున్నాయి.

Bihar Engineer Desi Jugaad Photo: गजब! एक मोटर से चला दिए तीन सीलिंग फैन, देसी जुगाड़ देख लोग बोले- ये बिहार का इंजीनियर ही होगा - Bihar Engineer Jugaad Someone Connected Three

అయితే ఈ మూడు ఫ్యాన్లలో ఒక ఫ్యాన్ తిరిగితే మిగతా రెండు ఫ్యాన్లు కూడా ఆటోమేటిక్ గా తిరిగేలా వ్యక్తి దీనిని డిజైన్ చేశాడు. అలా కనెక్ట్ చేసిన తీరు కూడా గజిబిజిగా లేకుండా చాలా ప్రత్యేకంగా స్పష్టంగా అర్థమయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోను బీహార్ కి చెందిన శైలేంద్ర అనే వ్యక్తి తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు ఇప్పటికే 67 వేల మంది రియాక్ట్ అవ్వగా, 2500కి పైగా షేర్లు కూడా వచ్చాయి. ఇక ఈ ఫోటోకి నేటి జనులు అధిక సంఖ్యలో స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇంజనీర్ తెలివిని ప్రశంసిస్తున్నారు. ఈ వ్యక్తి కరెంట్ బిల్ ఆదా చేసే విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు.