Unemployment Benefit : నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం. రూ. 2500 నిరుద్యోగ భృతిని అందజేయనున్నట్లు సమాచారం….

Unemployment Benefit :  రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు చత్తీస్ గడ్ ప్రభుత్వం ప్రకటించింది. నెలకు రూ. 2500 నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు ఇస్తున్నట్లుగా ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ బాగెల్ తెలియజేశారు. 12వ తరగతి పూర్తి చేసే నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 2500 అకౌంట్ లో జమచేసి వారికి సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నిరుద్యోగ భృతిని పొందేందుకు కొన్ని నిబంధనలను ప్రభుత్వం విధించింది. అయితే కుటుంబంలోని […]

  • Published On:
Unemployment Benefit : నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం. రూ. 2500 నిరుద్యోగ భృతిని అందజేయనున్నట్లు సమాచారం….

Unemployment Benefit :  రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు చత్తీస్ గడ్ ప్రభుత్వం ప్రకటించింది. నెలకు రూ. 2500 నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు ఇస్తున్నట్లుగా ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ బాగెల్ తెలియజేశారు. 12వ తరగతి పూర్తి చేసే నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 2500 అకౌంట్ లో జమచేసి వారికి సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ నిరుద్యోగ భృతిని పొందేందుకు కొన్ని నిబంధనలను ప్రభుత్వం విధించింది. అయితే కుటుంబంలోని వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది.

an-ambitious-decision-by-the-government-for-the-unemployed

అంతేకాక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అవకాశం ఇస్తున్నట్లుగా కండిషన్ పెట్టారు.అలాగే ఎంపీ ,ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ,మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ల కుటుంబంలోని నిరుద్యోగులు దీనికి అర్హులు కాదని పేర్కొన్నారు.అంతేకాక ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కూడా.. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించారు. అంతేకాక 12వ తరగతి పూర్తి చేసి ఏడాదిలోగా ఉద్యోగం తెచ్చుకోకుంటే..

an-ambitious-decision-by-the-government-for-the-unemployed

వారికి మరో ఏడాది నిరుద్యోగ భృతి పెంచనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు ప్రభుత్వం విధించిన నిర్ణీత ఫార్మాట్ లో అప్లై చేసుకోవాలని, ఇక మీ అప్లికేషన్ కు ఆమోదం లభిస్తే నెలకు రూ. 2500 అకౌంట్ లో నేరుగా జమ అవుతాయని సీఎం తెలిపారు. ఇక నిరుద్యోగ భృతి ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుందని అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీన మొదటి నెల నిరుద్యోగ భృతి పొందుతారని సీఎం తెలియజేశారు.దీంతో చత్తీస్ గడ్ యువత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక దీనిలో ఆమోదం పొందిన నిరుద్యోగులు ఈ నెల 30న నిరుద్యోగ భృతి అందుకోబోతున్నారు.