Viral Video : నడిరోడ్డుపై పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ …వైరల్ వీడియో.
Viral Video : బాధ్యతగా వ్యవహరిస్తూ ఆపదలో ప్రజలకు అండగా నిలబడే వారే పోలీసులు. అలాంటి పోలీస్ ఇటీవల నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ఆ పోలీస్ చేసిన పనికి మహిళ ఊరికే చూస్తూ కూర్చోలేదు..తన కాలికి ఉన్న చెప్పులు తీసి మరి పోలీసును వాయించేసింది. అయితే ఈ తతంగం అంత అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ […]
Viral Video : బాధ్యతగా వ్యవహరిస్తూ ఆపదలో ప్రజలకు అండగా నిలబడే వారే పోలీసులు. అలాంటి పోలీస్ ఇటీవల నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ఆ పోలీస్ చేసిన పనికి మహిళ ఊరికే చూస్తూ కూర్చోలేదు..తన కాలికి ఉన్న చెప్పులు తీసి మరి పోలీసును వాయించేసింది. అయితే ఈ తతంగం అంత అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై బాధిత మహిళ ఉన్నతాధికారులను సంప్రదించి జరిగిన సంఘటన వివరించి సదరు పోలీస్ పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని మధురా లో అక్టోబర్ 2వ తేదీన ఓ మహిళ ఆటోలో ఇంటికి వెళ్తుండగా పాన్ కోడ్ లింక్ రోడ్డు నుండి కైసా నగర్ కు వచ్చే మార్గం మధ్యలో మహిళా వెళుతున్న ఆటోను పోలీస్ అధికారులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న ఆ మహిళను పోలీస్ కిందకు దించాడు. అనంతరం ఆమె పట్ల పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సదరు మహిళ తెలియజేసింది. అయితే మొదట పోలీస్ అని భయపడిన మహిళ . పోలీస్ చేసిన చేష్టాలను చూసి తీవ్రంగా ఆగ్రహించింది. దీంతో తన కాలికి వేసుకున్న చెప్పుని తీసి నడిరోడ్డుపై పోలీసుని కొట్ట సాగింది. ఈ క్రమం లో ఆ మహిళను పోలీస్ కాలితో తనటం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. మరో పోలీస్ అతనిని ఆపుతున్న సరే మహిళపై దాడికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై నేటిజన్స్ పోలీస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహిళా పట్ల పోలీసు వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీస్ పై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు అతనిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత పోలీసుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులుు తెలియజేశారు.