Viral News : వేలమంది ప్రాణాలను కాపాడిన 12 ఏళ్ల బాలుడు…అతని ధైర్య సాహసాలకు దండం పెట్టాల్సిందే…

Viral News : పశ్చిమ బెంగాల్లోని 12 ఏళ్ల బాలుడు వందల మంది ప్రాణాలను కాపాడాడు.డామేజ్ అయిన రైల్వే ట్రాక్ ను గమనించిన బాలుడు తన ఎర్ర టీ షర్ట్ ను జండాగా ఉపయోగించి రైలు డ్రైవర్ ను హెచ్చరించాడు. తద్వారా పెద్ద రైలు ప్రమాదం జరగకుండా కాపాడాడు.పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్లోని మాల్దాలోని రైల్వే యాక్ట్ సమీపంలో సెప్టెంబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. ముసలిన్ షేక్ అనే బాలుడు యాక్ట్ లో పనిచేస్తున్న […]

  • Published On:
Viral News : వేలమంది ప్రాణాలను కాపాడిన 12 ఏళ్ల బాలుడు…అతని ధైర్య సాహసాలకు దండం పెట్టాల్సిందే…

Viral News : పశ్చిమ బెంగాల్లోని 12 ఏళ్ల బాలుడు వందల మంది ప్రాణాలను కాపాడాడు.డామేజ్ అయిన రైల్వే ట్రాక్ ను గమనించిన బాలుడు తన ఎర్ర టీ షర్ట్ ను జండాగా ఉపయోగించి రైలు డ్రైవర్ ను హెచ్చరించాడు. తద్వారా పెద్ద రైలు ప్రమాదం జరగకుండా కాపాడాడు.పూర్తి వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్లోని మాల్దాలోని రైల్వే యాక్ట్ సమీపంలో సెప్టెంబర్ 28న ఈ ఘటన చోటుచేసుకుంది. ముసలిన్ షేక్ అనే బాలుడు యాక్ట్ లో పనిచేస్తున్న వలస కూలీ కొడుకు. అయితే ఘటన జరిగిన సమయంలో ముసలిన్ కొందరు కూలీలతో కలిసి ఘటన స్థలంలో ఉన్నాడు. ఇక అక్కడే ఈ యాక్ట్ కు కాస్త సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ కొంత భాగం దెబ్బ తినడం ,ఇక అదే సమయానికి ఓ ప్యాసింజర్ రైలు వేగంగా రావడాన్ని బాలుడు గమనించాడు.

రైల్వే ప్రాజెక్టులకు మోక్షం కలిగేనా? | Will there be salvation for railway projects?

వెంటనే అప్రమత్తమైన బాలుడు తన ఎర్ర టీ షర్ట్ ను తీసి ఎదురుగా వస్తున్న రైలుకు చూపిస్తూ ఉపడం మొదలుపెట్టాడు. బాలుడు సిగ్నల్ గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. రైలు ఆగిన అనంతరం లోకో పైలట్ బాలుడు దగ్గరికి వచ్చి అడుగగా అసలు విషయం చెప్పాడు. అయితే భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీనిని గమనించిన బాలుడు రైలు ఆపేందుకు ఇలా చేశాడని నార్త్ ఈస్ట్ ప్రాంతీయ రైల్వే ప్రతినిధి సవ్యసాచి తెలియజేశారు. వర్షాల కారణంగా ట్రాక్ కింద దెబ్బతిన్న భాగాన్ని గమనించి బాలుడు సరియైన సమయంలో తెలివిగా వ్యవహరించాడని ఆయన తెలియజేశారు.

Malda boy

అనంతరం ఇంత గొప్ప పని చేసిన ఆ బాలుడిని అధికారులు ప్రశంసించారు. అంతేకాక రైల్వే శాఖ అధికారులు బాలుడిని ధైర్య ధ్రువీకరణ పత్రంతో సత్కరించారు. అలాగే కొంత మేర నగదు బహుమతిని కూడా అందించారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు డివిజనల్ రైల్ మేనేజర్ ఆ బాలుడు ఇంటికి వెళ్లి మరి అతన్ని అభినందించారు. ఇక ట్రాక్ దెబ్బతిన్న భాగాన్ని మరమ్మత్తులు చేసి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేవలం 12 ఏళ్ల బాలుడు ధైర్య సాహసాలను చూపి ఎంతోమంది ప్రాణాలను రక్షించడంతో బాలుడు ధైర్యానికి అందరు ఫిదా అవుతున్నారు. బాలుడు ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు.