Anganwadi jobs : 10వ తరగతి పాస్ అయితే చాలు సొంత ఊరిలోనే జాబ్ పక్క…కేవలం మహిళలకు మాత్రమే..

Anganwadi jobs : అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్వాడి ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల్లో కొలువుల జాతర మొదలైంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోనే అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5905 అంగన్వాడి పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ […]

  • Published On:
Anganwadi jobs : 10వ తరగతి పాస్ అయితే చాలు సొంత ఊరిలోనే జాబ్ పక్క…కేవలం మహిళలకు మాత్రమే..

Anganwadi jobs : అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన అంగన్వాడి ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాల్లో కొలువుల జాతర మొదలైంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోనే అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5905 అంగన్వాడి పోస్టులను గుర్తించిన ప్రభుత్వం ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులు వివరాలు ఇలా ఉన్నాయి . మొత్తం ఖాళీలు 5,905 ఉండగా దానిలో 1468 అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు అంగన్వాడి ఆయ పోస్టులు మొత్తం 4007 ,ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ భర్తీ చేయనుంది. నాలుగు జిల్లాల్లో నియామకాలకు ఆల్రెడీ చర్యలు తీసుకోగా మిగిలిన జిల్లాలకు సంబంధించిన నియామకాల చర్యలు త్వరలోనే నోటిఫికేషన్లో ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు.

నాలుగు జిల్లాల్లో నియామకాలు..

నాలుగు జిల్లాల్లో పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ విజయవంతంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం అనంతపురం, కడప ,విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో నియామకాల ప్రక్రియ సాగుతుంది. ఈ నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తంగా 500 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో ప్రస్తుతం అంగన్వాడి కార్యకర్తలు10 , అంగన్వాడి హెల్పర్స్ 53, మినీ అంగన్వాడి కార్యకర్తలు 15 పోస్టులు , భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి . దరఖాస్తులను 29-03-2023 సాయంత్రం 5:00 లోపు సంబంధిత అభివృద్ధి పథకము అధికారి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయమునకు నేరుగా గాని లేదా పోస్ట్ ద్వారా గాని అందజేయవలెను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి.

విద్యార్హత..

నోటిఫికేషన్ నాటికి పదవ తరగతి మరియు ఇంటర్ పాస్ అయినట్లయితే ఈ పోస్ట్ లకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి. లేదా ఆ ఊరి కోడలు అయి ఉండాలి.

సాలరి …

అంగన్వాడి టీచర్ నెలకు = రూ.11,500/-

మినీ అంగన్వాడి టీచర్ నెలకు = రూ.7000/-

అంగన్వాడి హెల్పర్ నెలకు = రూ.7000/-

దరఖాస్తు ఫీజు..

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కేవలం టెన్త్ అర్హత ద్వారా ఉద్యోగాలు భర్తీ.

జత పరచవలసిన దృవపత్రాలు..

1.పుట్టిన తేదీ వయసు ధ్రువీకరణ పత్రం.

2.కుల ద్రవీకరణ పత్రం..

3.విద్యార్హత ధ్రువీకరణ పత్రం..

4. స్వస్థల ధ్రువీకరణ పత్రం.

5. వితంతువు అయితే భర్త మరణం ధ్రువీకరణ పత్రం..

6. అనాధ అయితే అనాధ ధ్రువీకరణ పత్రం.

8. ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ జాబ్ కార్డ్..

ఎంపిక విధానం…

అంగన్వాడీ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 20-03-2023

ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 29-03-2023