Data science : 45 వేల ఉద్యోగాలు..ప్రారంభ దశలోనే 14 లక్షల వేతనం..

Data science : ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగం ప్రారంభమైందని చెప్పాలి. చాట్ జిపిటి, ఏఐ సెర్చ్ ఇంజిన్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు ఏఐతో ప్రస్తుతం ఉన్న ఎన్నో ఉద్యోగాలు కనుమరుగు అయిపోయే అవకాశాలు ఉన్నాయని భయాలు నెలకొన్నాయి. దీనిలో కొంత వాస్తవం ఉందనే చెప్పాలి. అయితే ఏఐతో పాత ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీి వాటి స్థానంలో మరో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. […]

  • Published On:
Data science : 45 వేల ఉద్యోగాలు..ప్రారంభ దశలోనే 14 లక్షల వేతనం..

Data science : ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యుగం ప్రారంభమైందని చెప్పాలి. చాట్ జిపిటి, ఏఐ సెర్చ్ ఇంజిన్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇప్పుడు ఏఐతో ప్రస్తుతం ఉన్న ఎన్నో ఉద్యోగాలు కనుమరుగు అయిపోయే అవకాశాలు ఉన్నాయని భయాలు నెలకొన్నాయి. దీనిలో కొంత వాస్తవం ఉందనే చెప్పాలి. అయితే ఏఐతో పాత ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీి వాటి స్థానంలో మరో కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ రంగం పై భారతదేశంలో సుమారు 45 వేల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని టీం లిస్ట్ డిజిటల్ సంస్థ ఒక అధ్యాయంలో తెలిపింది .

ఇక ఈ నివేదిక ప్రకారం ఏఐ అవకాశాలను పొందాలంటే విద్యార్థులు ఉద్యోగులు డాటా సైన్స్ మరియు మిషన్ లెర్నింగ్ వైపు దృష్టి పెట్టాల్సి ఉంటుంది . స్కేలబుల్ మిషన్ లెర్నింగ్ , అప్లికేషన్ రూపకల్పన మరియు లాంగ్వేజ్ స్క్రిప్టింగ్ పై పట్టు సాధించిన ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ఇక ప్రస్తుత  పరిస్థితుల్లో డాటా ఇంజనీర్లుగా చేరే ఫ్రెషర్లకు కూడా ప్రారంభ దశలోనే దాదాపుగా సంవత్సరానికి 14 లక్షలు వేతనం ఉంటుందని సమాచారం.

అలాగే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్లు కూడా సంవత్సరానికి 10 లక్షల వరకు వేతనం పొందవచ్చు. డెవలపర్స్, డేటా ఆర్కిటెక్లు, డాటా బేస్ అడ్మిన్స్, తదితర సంవత్సరానికి 12 లక్షల వరకు వేతనం ఉంటుందని ఈ నివేదికలో తేలింది. అంతేకాక ఈ రంగాలలో 8 ఏళ్ళ అనుభవం ఉన్నవారు సంవత్సరానికి దాదాపుగా 25 లక్షల నుండి 45 లక్షల వరకు వేతనం పొందవచ్చని అంచనా.. ఏఐ ఆధారిత అప్లికేషన్ల పై విద్యార్థులకు సరైన అవగాహన ఉంటేనే వారు ఈ జాబ్ మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడతారని ఈ నివేదిక పేర్కొంది.