Hair Growth : ఈ నూనెతో మీ జుట్టును ఒత్తుగా దృఢంగా తయారు చేసుకోవచ్చు…దీనికోసం ఏం చేయాలంటే….

Hair Growth : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.అయితే దీనికి గల ముఖ్య కారణం రోజు రోజుకు వాతావరణం లో పెరుగుతున్న కాలుష్యం అని చెప్పాలి. అలాగే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు కూడా కారణం అని చెప్పాలి. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వలన కూడా జుట్టు రాలుతూ ఉంటుంది.అయితే కేవలం ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా ఈ సమస్యలను బాగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే […]

  • Published On:
Hair Growth : ఈ నూనెతో మీ జుట్టును ఒత్తుగా దృఢంగా తయారు చేసుకోవచ్చు…దీనికోసం ఏం చేయాలంటే….

Hair Growth : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు.అయితే దీనికి గల ముఖ్య కారణం రోజు రోజుకు వాతావరణం లో పెరుగుతున్న కాలుష్యం అని చెప్పాలి. అలాగే ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు కూడా కారణం అని చెప్పాలి. మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం వలన కూడా జుట్టు రాలుతూ ఉంటుంది.అయితే కేవలం ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా ఈ సమస్యలను బాగా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే జుట్టు ను కాపాడుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. మరికొందరైతే ఈ సమస్యను తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయోగాలను చేస్తూ డబ్బులను వృధా చేసుకుంటున్నారు.

you-can-make-your-hair-thick-and-strong-with-this-oil-what-to-do-for-this

అయినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అంతేకాక వాటిని అధికంగా ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను ఎదుర్కొనే వారికి ఓ మంచి చిట్కాను తీసుకొచ్చాం. కేవలం మీ ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఈ చిట్కాను తయారు చేసుకుని వాడినట్లయితే కొద్ది రోజుల్లోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని దానిలో పావు లీటర్ వరకు కొబ్బరి నూనె పోసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఒక స్పూన్ మెంతులు, మూడు తమలపాకులు, గుప్పెడు కరివేపాకు మరియు 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. బాగా గోల్డ్ కలర్ లోకి వచ్చేంతవరకు వాటిని బాగా వేయించుకోవాలి.

you-can-make-your-hair-thick-and-strong-with-this-oil-what-to-do-for-this

గోల్డ్ కలర్ కు వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి.  అనంతరం ఒక గాజు సీసాను తీసుకొని దాంట్లోకి ఈ నూనెను వడకట్టుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ ను ఎప్పుడంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు.ఈ విధంగా ఆయిల్ ను వాడినట్లయితే అనతి కాలంలోనే మీ జుట్టు ఒత్తుగా తయారవుతుంది. ఇక దీనిలో వాడిన తమలపాకులు జుట్టును ఒత్తుగా పొడవుగా పెరగడంలో సహాయం చేస్తుంది. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే చాలా సులువుగా ఈ ఆయిల్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వినియోగించవచ్చు.