Sugar Free Beverages : డయాబెటిస్ పేషెంట్స్ వేసవిలో ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఇవే..అసలు మిస్ అవ్వకండి…

Sugar Free Beverages : ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. దీనివలన చాలామంది త్వరగా నీరస పడిపోతుంటారు. వేసవిలో ఉష్ణోగ్రత తేడా వలన చెమటలు ఎక్కువగా పడతాయి. తద్వార శరీరం డిహైడ్రేషన్ కు లోనవుతుంది. దీనివలన దాహం ఎక్కువగా అవుతుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు శీతల పానీయాలను తాగడానికి ఎక్కువగా మోగ్గు చూపుతుంటారు. అయితే షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న పానీయాలను తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా కొన్ని షుగర్ ఫ్రీ డ్రింక్స్ […]

  • Published On:
Sugar Free Beverages : డయాబెటిస్ పేషెంట్స్ వేసవిలో ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఇవే..అసలు మిస్ అవ్వకండి…

Sugar Free Beverages : ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. దీనివలన చాలామంది త్వరగా నీరస పడిపోతుంటారు. వేసవిలో ఉష్ణోగ్రత తేడా వలన చెమటలు ఎక్కువగా పడతాయి. తద్వార శరీరం డిహైడ్రేషన్ కు లోనవుతుంది. దీనివలన దాహం ఎక్కువగా అవుతుంటుంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు శీతల పానీయాలను తాగడానికి ఎక్కువగా మోగ్గు చూపుతుంటారు. అయితే షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్న పానీయాలను తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా కొన్ని షుగర్ ఫ్రీ డ్రింక్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వేసవి కాలంలో డయాబెటిస్ పేషెంట్లు ఇలాంటివి తీసుకోవడం వలన చాలా మంచిదని నిపుణుల సూచన. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

these-are-the-things-that-diabetes-patients-should-take-especially-in-summer-dont-miss-it

కొబ్బరి నీళ్లు….

ప్రకృతి నుండి సహజంగా లభించే పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. దీనిలో దాదాపుగా 90% నీరే ఉంటుంది. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం,ఎంజైమ్స్, బి విటమిన్ మెగ్నీషియం, ఐరన్ , వంటి ఎలక్ట్రోలైట్స్ కొబ్బరి నీళ్ల లో పుష్కలంగా ఉంటాయి. అలాగే కొబ్బరినీళ్లు ఫైబర్ కూడా సమృద్ధిగా కలిగి ఉంటుంది. కావున డయాబెటిస్ కలవారు వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

these-are-the-things-that-diabetes-patients-should-take-especially-in-summer-dont-miss-it

నిమ్మరసం…

వేసవిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిమ్మరసం తాగుతుంటారు. అయితే డయాబెటిస్ పేషెంట్స్ దీనిని షుగర్ లేకుండా తిసుకోవడం మంచిది. ఇది నీరసం తగ్గించి ఎనర్జీని అందిస్తుంది.

these-are-the-things-that-diabetes-patients-should-take-especially-in-summer-dont-miss-it

నీరు…

వేసవిలో శరీరానికి నీరు చాలా అవసరం. కావున క్రమం తప్పకుండా నీటిని తాగాలి. వేసవిలో అయితే వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. నీరు ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది.

these-are-the-things-that-diabetes-patients-should-take-especially-in-summer-dont-miss-it

బట్టర్ మిల్క్…

దీని సాల్టెడ్ లస్సి అని కూడా పిలుస్తారు. అలాగే ఎక్కువగా అందుబాటులో ఉండే పానీయాలలో బట్టర్ మిల్క్ ఒకటి. అంతేకాక ఈ బట్టర్ మిల్క్ ని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. బట్టర్ మిల్క్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

these-are-the-things-that-diabetes-patients-should-take-especially-in-summer-dont-miss-it

 

జీరా రసం..

వేసవిలో వచ్చే ఉష్ణోగ్రత నుండి ఉపశమనం పొందేందుకు జీరా రసం చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీరా రసం జీర్ణ క్రియను మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.