Hyper Acidity : హైపర్ ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా…ఈ చిట్కాలను పాటించండి…

Hyper Acidity  : ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా బయట ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవటం వలన చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య అనేది విపరీతంగా పెరిగితే హైపర్ ఎసిడిటీ గా మారుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక శాశ్వత ఒత్తిడి కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. దీని కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే హైపర్ ఎసిడిటీ వచ్చిన […]

  • Published On:
Hyper Acidity : హైపర్ ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా…ఈ చిట్కాలను పాటించండి…

Hyper Acidity  : ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా బయట ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవటం వలన చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్య అనేది విపరీతంగా పెరిగితే హైపర్ ఎసిడిటీ గా మారుతుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఒక శాశ్వత ఒత్తిడి కారణంగా జరుగుతుందని చెబుతున్నారు. దీని కారణంగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే హైపర్ ఎసిడిటీ వచ్చిన వారికి పొట్టలో పుండ్లు ,యాసిడ్ రిపికల్స్ వంటివి వస్తుంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మద్యపానం అధిక ధూమపానం, తదితర అలవాట్లు కారణంగా పొట్టలోని లైనింగ్ దెబ్బతిని ఇలాంటి సమస్యలు సంభవిస్తాయి. ఇక ఇది తీవ్రమైనప్పుడు కడుపులో విపరీతమైన మంట కలుగుతుంది. ఇలా ఎన్ని రోజులైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా కడుపులో మంట తగ్గడం అనేది జరగదు. దీని కారణంగా సరిగా ఆహారం తినలేక ప్రశాంతంగా నిద్ర కూడా పోలేక ఇబ్బందికి గురవ్వాల్సి ఉంటుంది. కడుపులో మంటతో పాటు గ్యాస్ సమస్య కూడా విపరీతంగా వేధిస్తుంది. కడుపు ఉబ్బరంగా మారినప్పుడు ఏదైనా తినాలన్న ఏ పనైనా చేయాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు ఆయుర్వేదంలో కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి సహజ సిద్ధంగా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. 3 సహజ పదార్థాలను ఉపయోగించి పొట్టలోని ఆమ్లాత్వాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధన్యక్ హిమ…

ఆయుర్వేదం ప్రకారం ధన్యక్ అంటే కొత్తిమీర గింజలు లేదా ధనియాలు అని అర్థం. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రభావితంగా పనిచేస్తాయి. పిత్త దోషాన్ని తగ్గించి ఆమ్లత్వాన్ని అదుపులో ఉంచుతాయి. అదే విధంగా ఈ విత్తనాలను రోజు తీసుకోవడం వలన అపాన వాయువు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే వీటిని తీసుకోవడానికి మీరు ముందుగా ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక ఆ నీటిని తెల్లవారు జామున వడకట్టి కాళీ కడుపుతో తాగాలి. దీని తీసుకోవడం వలన ఎసిడిటీ సమస్యతో పాటు బరువు కూడా తగ్గుతారు.

సోంపు- రాక్ షుగర్…

సోంపు గింజలు తినడం అనేది ఆరోగ్యకరమైన అలవాటు. దీనిలో యాంటీ అల్సర్ లక్షణాలు కడుపును చల్లబరిచి జీర్ణ వ్యవస్థకి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సోంపు గింజల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , హైపర్ ఎసిడిటీని నియంత్రించడానికి చాలా బాగా తోడ్పడతాయి. అయితే దీనికోసం ఒక టీ స్పూన్ సోంపు గింజలు రాక్ షుగర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని రోజు భోజనం చేసిన తర్వాత తినాలి. రోజుకు రెండుసార్లు తినడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాక ఆహార అరుగుదలకు ఈ సోంపు గింజలు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

బ్లాక్ కిస్మిస్…

బ్లాక్ కిస్మిస్ లో మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అదేవిధంగా కడుపులో ఆమ్లత్వం తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ప్రతిరోజు పరిగడుపున ధనియాల నీరు తాగిన తర్వాత 10 నల్ల ఎండుద్రాక్షలను తినడం వలన హైపర్ ఎసిడిటీ సమస్య తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.