Milk With Walnuts : పాలలో ఇవి కలుపుకొని తింటే జీవితం లో ఎలాంటి సమస్యలు దరిచేరవు..ఒకసారి ట్రై చేసి చూడండి..

Milk With Walnuts : నేటి కాలంలో చాలామంది చిన్న చిన్న పనులకి చాలా అలసిపోతున్నారు. అలాగే కొద్ది దూరం నడవగానే ఆయాస పడుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోలేక నీరసం, బలహీనత శరీర నొప్పులతో బాధపడుతున్నారు.దీనికి ప్రధాన కారణాలు పోషకాహార లోపం ఒత్తిడి ఆందోళన అని చెప్పవచ్చు. ఈ కారణాల చేత శరీరంలో శక్తి లేనట్లు అనిపిస్తుంది. దీనివలన ఏ పని అయినా కూడా సరిగా చేయలేక నిరసించి పోతుంటాం. చేసే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాము. […]

  • Published On:
Milk With Walnuts : పాలలో ఇవి కలుపుకొని తింటే జీవితం లో ఎలాంటి సమస్యలు దరిచేరవు..ఒకసారి ట్రై చేసి చూడండి..

Milk With Walnuts : నేటి కాలంలో చాలామంది చిన్న చిన్న పనులకి చాలా అలసిపోతున్నారు. అలాగే కొద్ది దూరం నడవగానే ఆయాస పడుతున్నారు. రోజంతా ఉత్సాహంగా పనిచేసుకోలేక నీరసం, బలహీనత శరీర నొప్పులతో బాధపడుతున్నారు.దీనికి ప్రధాన కారణాలు పోషకాహార లోపం ఒత్తిడి ఆందోళన అని చెప్పవచ్చు. ఈ కారణాల చేత శరీరంలో శక్తి లేనట్లు అనిపిస్తుంది. దీనివలన ఏ పని అయినా కూడా సరిగా చేయలేక నిరసించి పోతుంటాం. చేసే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాము. ఇలాంటి సమస్యలతో ఇబ్బందిడేవారు ఈ చిన్న చిట్కాను ఉపయోగించడం ద్వారా శరీరాన్ని శక్తివంతంగా మలుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నీరసం బలహీనతను తగ్గించి శరీరానికి శక్తినిచ్చే ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం.

if-you-mix-these-in-milk-and-eat-it-you-will-not-face-any-problems-in-life-try-it-once

if-you-mix-these-in-milk-and-eat-it-you-will-not-face-any-problems-in-life-try-it-once

అయితే ఈ చిట్కా కోసం వాల్ నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు దీని ద్వారా అందుతాయి. దీనితో పాటు ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి కావలసిన రెండో పదార్థం ఎండు ద్రాక్ష. దీనిలో శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ ,మినరల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవడం వలన జీర్ణం వ్యవస్థ కూడా మెరుగు అవుతుంది. ఎండుద్రాక్ష వలన శరీరంలో వ్యర్ధాలు తొలగిపోయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని ఉపయోగించి ఆ చిట్కా ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వాల్ నట్స్, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్ష వేసి కలుపుకోవాలి. ఇలా తీసుకున్న పాలను ఒక పొంగు వచ్చేవరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత దీనిలో రుచి కొరకు ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా పటిక బెల్లం కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను రోజు ఉదయం అల్పాహారం చేసిన ఒక గంట రెండు గంటల తర్వాత తీసుకోవాలి. అయితే ముందుగా పాలల్లో ఉండే వాల్ నట్స్, ఎండి ద్రాక్ష తిన్న తర్వాత పాలను త్రాగాలి. ఇలా తీసుకోవడం వలన పోషకాలు సరిగా అందుతాయి. అంతేకాక శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఈ చిట్కాను వాడడం వలన రక్తహీనత కూడా తగ్గుతుంది.