Goat Milk : మేకపాలు ఎప్పుడైనా తాగారా…అద్భుతమైన ప్రయోజనాలు మీకోసం…

Goat Milk  : ప్రస్తుత కాలంలో చాలామంది ఆవుపాలు లేదా గేదె పాలన ఎక్కువగా తాగుతున్నారు…కానీ మన తాతల కాలంలో పల్లెటూర్లలో మేక పాలు ఎక్కువగా తాగేవారని మీకు తెలుసా. అయితే ఈ మధ్యకాలంలో కూడా మేకపాలకు ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే మేకపాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ పాలను డైట్ లో చేర్చుకున్నట్లైతే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సైతం వెల్లడించారు. ఇక ఈ మేకపాల ధర […]

  • Published On:
Goat Milk : మేకపాలు ఎప్పుడైనా తాగారా…అద్భుతమైన ప్రయోజనాలు మీకోసం…

Goat Milk  : ప్రస్తుత కాలంలో చాలామంది ఆవుపాలు లేదా గేదె పాలన ఎక్కువగా తాగుతున్నారు…కానీ మన తాతల కాలంలో పల్లెటూర్లలో మేక పాలు ఎక్కువగా తాగేవారని మీకు తెలుసా. అయితే ఈ మధ్యకాలంలో కూడా మేకపాలకు ప్రజలలో మరింత ఆదరణ పెరుగుతుంది. ఎందుకంటే మేకపాలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక ఈ పాలను డైట్ లో చేర్చుకున్నట్లైతే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సైతం వెల్లడించారు. ఇక ఈ మేకపాల ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

ప్రీబయోటిక్స్‌ ఎక్కువగా ఉంటాయ్..

అయితే మేక పాలలో కూడా ఆవుపాలతో సమానమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. కానీ మేక పాలలో కొవ్వు గ్లోబుల్స్ ఆవు పాలల్లో పోలిస్తే చాలా చిన్నగా ఉంటాయి. దీని కారణంగా ఇవి త్వరగా జీర్ణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మేకపాలను తాగినప్పుడు కడుపులోకి వెళ్ళిన తర్వాత పెరుగుగా మారుతుందట. ఇది ఆవు పాలలో చేసిన పెరుగు కంటే చాలా మెత్తగా ఉంటుంది. ఆవు పాలలో 10 శాతం పెరుగు ఉంటే మేకపాలలో మాత్రం 2% మాత్రమే పెరుగు ఉంటుంది. ఇది శరీర జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. కావున గ్యాస్ , ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మేకపాలన తీసుకోవడం ఎంతో ఉత్తమం.

అదేవిధంగా మేకపాలలో ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓలిగోశాఖకరైడ్లు కూడా ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అలాగే ఒక కప్పు మేకపాలలో ఆవుపాలకంటే 12 శాతం తక్కువ లాక్టోసూ ఉంటాయి. లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్నవారు మేకపాలను తాగవచ్చు . కానీ ఈ సమస్య ఉన్నవారు మేకపాలను తాగే ముందు డాక్టర్ను సంప్రదించటం మంచిది.

https://youtu.be/Zd6WvWyXuXA?si=mADoSsySGU9glrSU

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.