Plastic Bottles : ప్లాస్టిక్ బాటిల్లో నీరు ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా…

Plastic Bottles : శరీరానికి నీరు అత్యంత ముఖ్యమైన పోషకం..నీరు మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. దీంతో రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ నీరు తాగితే మన ఆరోగ్యానికి చాలా […]

  • Published On:
Plastic Bottles : ప్లాస్టిక్ బాటిల్లో నీరు ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా…

Plastic Bottles : శరీరానికి నీరు అత్యంత ముఖ్యమైన పోషకం..నీరు మనిషి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. దీంతో రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని తాగాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని ఎక్కువగా తాగుతున్నారు. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ నీరు తాగితే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజువారి కార్యకలాపాలలో చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు.అలాంటి పొరపాట్లలో ప్లాస్టిక్ బాటిల్ నీటిని తాగడం కూడా ఒకటని చెప్పాలి. అయితే గత కొంత కాలం గా బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి.

ఇక వీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి చవక ధరకే అందుబాటులోకి వస్తున్నాయి.  అంతేకాక కూల్ డ్రింక్స్ తీసుకున్న బాటిల్స్ ని కూడా మనం క్లీన్ చేసి నియోగించుకుంటున్నాం. కానీ ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో తెలుసా…? అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ను ప్లాస్టిక్ పౌడర్ లేదా మైక్రో ప్లాస్టిక్లను ఉపయోగించి చేస్తారు. ఇక ఈ మైక్రో ప్లాస్టిక్లు చాలా చిన్నవి. అవి మన కంటికి కూడా కనిపించవు. ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే ఈ మైక్రో ప్లాస్టిక్ లు నీటిలో సులువుగా కరిగిపోతాయి. తద్వారా ప్లాస్టిక్ లొ ప్రతిరోజు నీటిని నింపటం వలన మైక్రో ప్లాస్టిక్లను విడుదల చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మనం ప్లాస్టిక్ బాటిల్స్ లోని నీటిని తాగినప్పుడు మనకు తెలియకుండానే ఈ మైక్రో ప్లాస్టిక్లు మన శరీరంలోకి వెళ్తున్నాయి.

ఇక ఈ కలుషిత నీరు సంభావ్య ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ మైక్రో ప్లాస్టిక్లతో పాటు అనేక రకాల రసాయనాలు కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి విడుదలవుతాయి. దీని కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కావున ఈ వ్యాధుల నుండి నివారణ పొందడానికిి ప్లాస్టిక్ బదులుగా స్టైన్లెస్ స్టీల్ గాజు వంటి వాటిని వినియోగించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్లాస్టిక్ కాలుష్యం నుండి మన పర్యావరణాన్ని కాపాడుకోవడంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము.