SWEET PAPAYA : బొప్పాయిని కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి…ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

SWEET PAPAYA : ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బొప్పాయి ఒకటి. అయితే బొప్పాయి తీపిగా లేకపోయినా సరిగా పండకపోయినా దాని రుచి అస్సలు బాగోదు. అందుకే బొప్పాయిని కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తద్వారా మంచిగా పండిన బొప్పాయిని కొనుగోలు చేయగలుగుతాం. అయితే బొప్పాయిని కొనే సమయంలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి మంచిగా పండినప్పుడు దానిపై పసుపు రంగు చారలు కచ్చితంగా ఏర్పడతాయి. అయితే కొనుగోలు చేసే సమయంలో […]

  • Published On:
SWEET PAPAYA : బొప్పాయిని కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి…ఆరోగ్యాన్ని కాపాడుకోండి..

SWEET PAPAYA : ఆరోగ్య ప్రయోజనాలను అందించే పండ్లలో బొప్పాయి ఒకటి. అయితే బొప్పాయి తీపిగా లేకపోయినా సరిగా పండకపోయినా దాని రుచి అస్సలు బాగోదు. అందుకే బొప్పాయిని కొనే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తద్వారా మంచిగా పండిన బొప్పాయిని కొనుగోలు చేయగలుగుతాం. అయితే బొప్పాయిని కొనే సమయంలో ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి మంచిగా పండినప్పుడు దానిపై పసుపు రంగు చారలు కచ్చితంగా ఏర్పడతాయి. అయితే కొనుగోలు చేసే సమయంలో కనీసం ఒక పసుపు చార లేదా

atips-to-buy-a-fresh-and-sweet-papaya

నారింజ రంగు చార కనిపించకపోతే ఆ బొప్పయిన అసలు కొనకండి. ఎందుకంటే అలాంటి బొప్పాయి పండ్లు అసలు తీపిని కలిగి ఉండవు. తద్వారా దాని రుచి కూడా వేరేలా అనిపిస్తుంది. అలాగే బొప్పాయిని తీసుకునే సమయంలో దాని దిగువ భాగంలో మెల్లిగా నొక్కి చూడండి. అలా మీరు నొక్కినప్పుడు అది లోపలకు నొక్కుకపోతే దానిని అస్సలు తీసుకోకండి. ఎందుకంటే అది లోపల నుండి కుళ్ళిపోయి ఉండవచ్చు. అలాగే బొప్పాయి కింది భాగంలో లేదా పై భాగంలో ఫంగస్ లాగా ఏదైనా కనిపిస్తే దానిని అస్సలు తీసుకోకండి.

atips-to-buy-a-fresh-and-sweet-papaya

ఇలా కలిగి ఉన్న పండు పాడైపోయిందని అర్థం. అయితే మంచి బొప్పాయిని కొనేముందు వాసన చూడండి. అలా చూసినప్పుడు దాని నుండి తీపి వాసన వచ్చినట్లయితే , అది లోపల మంచిగా పండిందని తీయగా ఉంటుందని అర్థం. అలాగే బొప్పాయి కొనుగోలు చేసేటప్పుడు దాని తొక్కను కూడా నొక్కి చూడండి. బొప్పాయి పసుపు రంగులో ఉన్నప్పటికీ తొక్క గట్టిగా ఉంటే మాత్రం అది ఇంకా పండలేదు అని అర్థం.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ మరియు నిపుణుల సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు