Papaya : బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి తీసుకుంటున్నారా…?అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త….

Papaya : ఎర్రగా పండిన బొప్పాయి పండును చూసి తినకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి…అయితే ఈ బొప్పాయి పండ్ల లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు ,ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయని చెప్పాలి.అయితే ఈ బొప్పాయి పండును పచ్చిగా లేదా పండిన తర్వాత ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక ఈ బొప్పాయి పండులో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. మరి ముఖ్యంగా జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి అలాగే బరువు తగ్గడానికి బొప్పాయి […]

  • Published On:
Papaya : బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి తీసుకుంటున్నారా…?అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త….

Papaya : ఎర్రగా పండిన బొప్పాయి పండును చూసి తినకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి…అయితే ఈ బొప్పాయి పండ్ల లో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు ,ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయని చెప్పాలి.అయితే ఈ బొప్పాయి పండును పచ్చిగా లేదా పండిన తర్వాత ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక ఈ బొప్పాయి పండులో ఉండే పోషకాలు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. మరి ముఖ్యంగా జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి అలాగే బరువు తగ్గడానికి బొప్పాయి కీలకంగా వ్యవహరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ బొప్పాయి పండు డయాబెటిస్ రోగులకు వరం అని చెప్పాలి. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ ఏ ,సీ ,బీ ప్రోటీన్లు ఫైబర్ అధిక సంఖ్యలో ఉంటాయి . అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక దీనిలో గ్లైసేమిక్ ఇండెక్స్ 60 శాతం కంటే తక్కువగా ఉంటుంది. అందుకే బొప్పాయి పండును ప్రతిరోజు ఫిట్ నెస్ లో భాగంగా చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయిలో పాపయిన్ అనే ఎంజాయ్ కూడాటుంది. ఇక ఇది శరీరంలో యాంటీ అలర్జీగా పనిచేసే పేగు పుండ్లను నయం చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అయితే ఇన్ని ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ బొప్పాయి పండును కొన్ని రకాల పండ్లతో కలిపి తినడం వలన అది విషం లా మారుతుందని అలాగే శరీరంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామా.

బొప్పాయి నిమ్మకాయ..

బొప్పాయి నిమ్మకాయను అస్సలు కలిపి తీసుకోకూడదట. ఈ రెండు పండ్లను కలిపి తీసుకోవడం వలన హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే బొప్పాయి పండుతో నిమ్మకాయను అస్సలు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేడి ఆహారం…

వేడి ఆహారంతో బొప్పాయి పండును అస్సలు తీసుకోకూడదట. అలాగే పెరుగు చలువ అని అందరికీ తెలుసు కానీ పెరుగుతో కూడా బొప్పాయి పండును అసలు కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే బొప్పాయి పండు తీసుకున్న రెండు గంటల తర్వాత పెరుగన్నం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

టమాట బొప్పాయి…

బొప్పాయి టమాట కలయిక శరీరానికి అంత మంచిది కాదు. వీటిని కలిపి తీసుకుంటే ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.