White Eggs Vs Brown Eggs : ఆరోగ్యానికి వైట్ ఎగ్స్ మంచిదా..?బ్రౌన్ ఎగ్స్ మంచిదా…?నిపుణులు ఏం చెబుతున్నారంటే…

White Eggs Vs Brown Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలలో గుడ్లు కూడా ఒకటి. అయితే ఈ గుడ్లు మార్కెట్లో తెలుపు మరియు గోధుమ రంగు లో అందుబాటులో ఉంటాయి. అయితే తెల్లని పెంకు కలిగిన ఫారెన్ కోడి గుడ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. అదే కాస్త పెద్ద మార్కెట్ లేదా సూపర్ బజార్ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తెలుపు రంగు గుడ్డుతో పాటు ముదురు గోధుమ రంగులో కూడా గుడ్లు […]

  • Published On:
White Eggs Vs Brown Eggs : ఆరోగ్యానికి వైట్ ఎగ్స్ మంచిదా..?బ్రౌన్ ఎగ్స్ మంచిదా…?నిపుణులు ఏం చెబుతున్నారంటే…

White Eggs Vs Brown Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలలో గుడ్లు కూడా ఒకటి. అయితే ఈ గుడ్లు మార్కెట్లో తెలుపు మరియు గోధుమ రంగు లో అందుబాటులో ఉంటాయి. అయితే తెల్లని పెంకు కలిగిన ఫారెన్ కోడి గుడ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. అదే కాస్త పెద్ద మార్కెట్ లేదా సూపర్ బజార్ వంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తెలుపు రంగు గుడ్డుతో పాటు ముదురు గోధుమ రంగులో కూడా గుడ్లు కనిపిస్తాయి. ఇక అప్పుడు ఏ రంగు గుడ్లు తీసుకుంటే మంచిది అనే విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే చాలామంది బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్ , బ్రౌన్ బ్రెడ్ లాగానే బ్రౌన్ ఎగ్స్ కూడా చాలా ఆరోగ్యకరమైనవని భావిస్తారు.

మరికొందరు వైట్ ఎగ్స్ లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని వాటినే తీసుకుంటారు. అయితే ఈ రెండింటిలో అసలు ఏమి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది..?మరి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందామా… మార్కెట్లో లభించే గుడ్లు ఏమి తిన్న ఆరోగ్యానికి మంచిదేనని పోషకాహార నిపుణులు చేబుతున్నారు. అలాగే కోడి జాతులు ఆధారంగా అవి పెట్టె గుడ్ల రంగు ఆధారపడి ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే అండలూసియాన్ , వైట్ లైఘార్న్ అనే జాతి కోళ్ళు వైట్ గుడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఇక గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ , వంటి జాతి కోళ్ళు బ్రౌన్ రంగు పెంకులతో గుడ్లను ఉత్పత్తి చేస్తాయి.

are-white-eggs-good-for-health-are-brown-eggs-good-what-do-experts-say

బ్రౌన్ ఎగ్స్…

వైట్ ఎగ్స్ తో పోలిస్తే బ్రౌన్ ఎగ్స్ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఇక వీటిలో పోషకాల విషయానికి వస్తే మాత్రం రెండు సమానంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ముదురు గోధుమ రంగు గుడ్లలో ఓమేగా 3 , ఫ్యాటీ ఆమ్లాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఓమైగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా తీసుకోవాలనుకున్నవారు గోధుమ రంగు గుడ్లను తీసుకోవడం చాలా మంచిది. అయితే ఏ రంగు కోడిగుడ్లు అయినా సరే రోజుకు ఒకటి తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఆహారంలో గుడ్డును తీసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

అయితే చాలామంది వైట్ ఎగ్స్ కన్నా బ్రౌన్ ఎగ్స్ ఎక్కువ నాణ్యతను కలిగి ఉంటాయని అందుకే వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే తెల్ల కోడిగుడ్లు మార్కెట్ లో అధిక సంఖ్యలో ఉత్పత్తి అవ్వడం వలన వాటి ధర అనేది తక్కువగా ఉంటుంది. ఇక బ్రౌన్ ఎగ్స్ విషయానికి వస్తే ఇవి చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. అలాగే వీటి ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉండటం వలన వీటి ధర అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా బ్రౌన్ ఎగ్స్ కోళ్లు నాటు కోళ్లుగా పిలవబడతాయి. అందుకే వీటి మాంసం మరియు వీటి గుడ్లకు ధర ఎక్కువగా ఉంటుంది.