History Of Ayodhya : రామ మందిర నిర్మాణానికి ఎందుకు ఇంత విశిష్టత…500 ఏళ్లుగా అసలు ఏం జరిగిందంటే…

History Of Ayodhya  : కొత్త యుగ సాంకేతిక సౌకర్యాలు మరియు పురాతన భారతీయ సాంప్రదాయాలు కలయికతో స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో నిర్మిస్తున్న అతిపెద్ద ఆలయం రామ మందిరం . గత 500 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ నిర్మాణం కోసం ఎన్నో అల్లర్లు జరిగాయి. ఇక ఈ టెంపుల్ లో ఉన్న ప్రాంతం ముస్లింలకు హిందువులకు చాలా ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆడని మాట తప్పనివాడు, తండ్రి మాట జవదాటని వాడు, ఏకపత్నివతుడైన […]

  • Published On:
History Of Ayodhya : రామ మందిర నిర్మాణానికి ఎందుకు ఇంత విశిష్టత…500 ఏళ్లుగా అసలు ఏం జరిగిందంటే…

History Of Ayodhya  : కొత్త యుగ సాంకేతిక సౌకర్యాలు మరియు పురాతన భారతీయ సాంప్రదాయాలు కలయికతో స్వాతంత్రం తర్వాత మన భారతదేశంలో నిర్మిస్తున్న అతిపెద్ద ఆలయం రామ మందిరం . గత 500 సంవత్సరాల నుండి ఈ టెంపుల్ నిర్మాణం కోసం ఎన్నో అల్లర్లు జరిగాయి. ఇక ఈ టెంపుల్ లో ఉన్న ప్రాంతం ముస్లింలకు హిందువులకు చాలా ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆడని మాట తప్పనివాడు, తండ్రి మాట జవదాటని వాడు, ఏకపత్నివతుడైన శ్రీరాముడు జన్మించిన స్థలం ఈ అయోధ్య. మరి ఈ అయోధ్య విశేషాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం రాముడు జన్మించిన స్థలం అయోధ్య. ఇక ఈ నగరాన్ని శ్రీరాముడు తండ్రి అయిన దశరథ మహారాజు పాలించారు. అయితే ఈ ప్రాంతం ముస్లింల చేతికి ఎలా వెళ్ళింది. అక్కడ మసీదులో శ్రీరాముని విగ్రహాలు ఎందుకు ఉన్నాయి. గత 500 సంవత్సరాల నుండి జరుగుతున్న గొడవలపై సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది. ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పైజాబాద్ జిల్లా సరయు నది ఒడ్డున ఈ అయోధ్య నగరం ఉంది. ఇక ఈ నగరంలో 2.7 ఎకరాల స్థలం హిందువులకు మరియు ముస్లింలకు అతి ముఖ్యమైన స్థలం. ఇక ఈ స్థలంలో ఒక మసీదు కూడా ఉంది.

దాని పేరే బాబ్రీ మసీద్. అలాగే ఇక్కడ మసీదుకు ఎదురుగా ఒక మూలన శ్రీరాముని గుడి కూడా ఉంది. దాని పేరు రామసబుద్ర .ఇక ఈ టెంపుల్లో సీతారాముల వారి విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉంచారు. దీంతో ఈ 2.7 ఎకరాల స్థలం వలన హిందువులకు ముస్లింలకు గొడవలు జరిగాయి. అయితే 1528 సంవత్సరంలో మొగల్ ఆ సామ్రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఇక ఆ సమయంలో అప్పటి రాజైన బాబర్ మసీదును కట్టమని ఆదేశాలు ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్న శ్రీరాముని గుడిని పడగొట్టి మసీదు కట్టించారని ఆధారాలు ఎక్కడా లేవు. అయితే అప్పటి మొగల్ రాజులు హిందువుల టెంపుల్స్ ను పడగొట్టారని మనకు తెలిసిందే. అందుకే ఈ మసీదును కూడా అలాగే కట్టారని అక్కడి ప్రజల నమ్మకం. ఇక 1700 సంవత్సరంలో జై సింగ్ అనే హిందూ రాజు 2.7 ఎకరాల స్థలాన్ని శ్రీరాముని పేరున రిజిస్టర్ చేయించాడు. అలాగే ఆ స్థలంలో ఉన్న గుడికి హిందువులను అనుమతించగా అప్పటినుండి హిందువులు ముస్లింలు ఆస్థానంలో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆ తర్వాత 1870లో బ్రిటిష్ వారు రెండు గుడ్లకు మధ్యలో కంచవేసి హిందువులు ముస్లింలు వేరువేరుగా ప్రార్థన చేసుకునే విధంగా స్థలాన్ని కేటాయించారు. 1950వ సంవత్సరంలో అనుకోకుండా హిందువులకు ముస్లింలకు మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే హిందువులు కొంతమంది గుడిలో ఉన్న సీతారాముల విగ్రహాలను మసీదులో పెట్టారు.

ఇక ఆ విగ్రహాలను మసీదులో చూసిన ముస్లింలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బరిలోకి దిగిన పోలీసులు ఆ స్థలాన్ని లాక్ చేసి ఎవరు ప్రార్థనలు చేయకూడదని ఆర్డర్ పాస్ చేశారు. తర్వాత ఈ స్థలం తమదంటే తమదని మూడు ఆర్గనైజేషన్స్ వారు కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే 1952 ,1961 ,1964 వరకు కోర్టు లో ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇక 1986లో కోర్టు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇక ఆ తర్వాత మరోసారి జరిగిన గొడవల్లో దాదాపు 2 వేల మంది మరణించడం జరిగింది. దీంతో కోర్టు ఆ స్థలం అసలు ఎవరికీ చెందిందనే వివరాలను చూపించాల్సిందిగా కోరింది. ఇక దీనిపై కోర్టు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. అన్నింటినీ గమనించిన సుప్రీంకోర్టు నవంబర్ 9 2019లో తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే ముస్లింలు హిందువులు ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారనేది వాస్తవం కానీ ఆ స్థలం జై సింగ్ శ్రీరాముని పేరిట రిజిస్టర్ చేయించారు. కాబట్టి ఆ స్థలం శ్రీరామునికి చెందింది. కాబట్టి అక్కడ గుడి కట్టేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే అక్కడ ఉన్న మసీదును కూల్చివేయడం చట్టం విరుద్ధం కాబట్టి అయోధ్యలోనే ఐదు ఎకరాలను ఉచితంగా ఇవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ కు చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు. ఇలా 500 ఏళ్ళుగా కట్టాలి అనుకుంటున్నా అయోధ్య శ్రీరాముని గుడి ఎంతోమంది ఆశలు కలలు ఈరోజు నెరవేరబోతున్నాయని చెప్పాలి. మరి కొద్ది గంటల్లో శ్రీరాముడు సీత సమేతుడై భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.