Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త…ఇకపై ఆ టికెట్ల కోసం క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు..
Tirumala : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇప్పుడు భక్తులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అయితే గతంలో ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచి ఆలోచన చేసిన టీటీడీ […]
Tirumala : తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనానికి కేటాయించే టికెట్లను ఇప్పుడు భక్తులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే విధంగా టీటీడీ చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. అయితే గతంలో ఎంబీసీ 34 లోని కౌంటర్ వద్ద ఈ టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచి ఆలోచన చేసిన టీటీడీ తాజాగా దీనిపై నూతన విధానాలను అమలు చేసింది. ఈ క్రమంలోనే సిఫారసు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్ కు ఒక లింకు మెసేజ్ ను పంపిస్తున్నారు. ఇక భక్తులు ఆ లింకును ఉపయోగించి పేమెంట్ ఆప్షన్ ద్వారా ఆన్లైన్ లోనే నగదు చెల్లిస్తే డైరెక్ట్ గా ఫోన్ లోకి టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
దీనివలన క్యూ లైన్ లో భక్తుల రద్దీ తగ్గుతుందని టీటీడీ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విధానాన్ని గత రెండు రోజుల నుండి టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక దీనిపై భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకొనున్నారు. అయితే ఇప్పటివరకు తిరుమల తిరుపతిలో విఐపి బ్రేక్ దర్శన టికెట్లు కోసం భక్తులు ఎంబీసీ కౌంటర్ వద్ద చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు అలాంటి అవసరం ఉండదని టీటీడీ అధికారులు తెలియజేస్తున్నారు. ఒకరకంగా ఇది భక్తులకు శుభవార్త అని చెప్పాలి. ఇక ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ అధికారులు తెలియజేస్తున్నారు.