Ayodhya : అయోధ్యలో అసలు ప్రతిష్ట చేయాల్సిన విగ్రహం ఇదే… మరి ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేశారంటే…

Ayodhya ; అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాట నిరీక్షణ తర్వాత బాల రాముని విగ్రహం సోమవారం నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్ట జరిగింది. కాగా అంతకుముందు రాములల్లా విగ్రహాన్ని తయారుచేసే పనిని ముగ్గురు శిల్పిలికి అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే అయోధ్య రామ ప్రతిష్టకు ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేసింది ట్రస్ట్. చివరికి మైసూర్ కి చెందిన అరుణ్ యోగి రాజ్ తయారుచేసిన విగ్రహన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలాల్ల విగ్రహాలను ఆలయంలో […]

  • Published On:
Ayodhya : అయోధ్యలో అసలు ప్రతిష్ట చేయాల్సిన విగ్రహం ఇదే… మరి ఈ విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేశారంటే…

Ayodhya ; అయోధ్యలో ఎన్నో శతాబ్దాల పోరాట నిరీక్షణ తర్వాత బాల రాముని విగ్రహం సోమవారం నరేంద్ర మోడీ సమక్షంలో ప్రతిష్ట జరిగింది. కాగా అంతకుముందు రాములల్లా విగ్రహాన్ని తయారుచేసే పనిని ముగ్గురు శిల్పిలికి అప్పగించింది ఆలయ ట్రస్ట్. అయితే అయోధ్య రామ ప్రతిష్టకు ముందు రెండు విగ్రహాలను ఎంపిక చేసింది ట్రస్ట్. చివరికి మైసూర్ కి చెందిన అరుణ్ యోగి రాజ్ తయారుచేసిన విగ్రహన్ని ఆలయంలో ప్రతిష్టించారు. అయితే ఎంపిక కానటువంటి రాంలాల్ల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించలేకపోయినప్పటికీ ఆలయ ట్రస్ట్ ఆ విగ్రహలను ఎలా ఉన్నాయో చూపించారు. అయితే ఈ విగ్రహాన్ని జైపూర్ కి చెందిన సత్యనారాయణ పాఠి అనే శిల్పి చెక్కారు.

this-is-the-original-statue-to-be-installed-in-ayodhya-and-what-has-been-done-to-this-statue-now

 

ఆయన గత కొన్ని సంవత్సరాలుగా శిల్పకళాకారుడిగా పనిచేస్తున్నారు. కాగా ముందు ప్రతిష్టించాలి అనుకున్న రామ్ లల్లా విగ్రహాన్ని తెల్లని పాల రాయితో తయారు చేశారు. ఇక ఈ విగ్రహం ప్రస్తుతం ఆలయ ట్రస్ట్ దగ్గర ఉంది. ఈ విగ్రహాన్ని వారి వద్ద మాత్రమే ఉంచుకుంటారు. ఇది ఇలా ఉండగా ఐదు శతాబ్దాల తర్వాత 2019లో సుప్రీంకోర్టు రామ మందిరానికి అనుకూలంగా తీర్పు ఇచ్చి ఆలయ మందిరాన్ని నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 2020 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా 2024 జనవరి 22 సోమవారం అయోధ్యలో రాము లల్లా ప్రతిష్ట జరిగింది. ఇక ఇప్పుడు సాధారణ భక్తుల సైతం బాల రాముని దర్శించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.