Vastu Tips : ఈ వస్తువులు మీ బాత్రూం లో ఉంటే మీ దురదృష్టానికి స్వాగతం పలికినట్లే… జాగ్రత్త…

Vastu Tips : ఆధునిక కాలంలో ఎంత ముందడుగులు వేస్తున్నప్పటికీ వాస్తు నియమాలను అనుసరించడం మాత్రం ప్రతి ఒక్కరు తూచా తప్పక పాటిస్తున్నారు. అదేవిధంగా వాస్తు నియమాలకు అనుగుణంగా ఇల్లును కట్టుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక ఈ విషయాలను వాస్తు శాస్త్ర నిపణులు సైతం చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో కొన్ని ప్రదేశాలలో కొన్ని వస్తువులను ఉంచటం వలన కూడా మన ఇంట్లో పరిస్థితులు ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే […]

  • Published On:
Vastu Tips : ఈ వస్తువులు మీ బాత్రూం లో ఉంటే మీ దురదృష్టానికి స్వాగతం పలికినట్లే… జాగ్రత్త…

Vastu Tips : ఆధునిక కాలంలో ఎంత ముందడుగులు వేస్తున్నప్పటికీ వాస్తు నియమాలను అనుసరించడం మాత్రం ప్రతి ఒక్కరు తూచా తప్పక పాటిస్తున్నారు. అదేవిధంగా వాస్తు నియమాలకు అనుగుణంగా ఇల్లును కట్టుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇక ఈ విషయాలను వాస్తు శాస్త్ర నిపణులు సైతం చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో కొన్ని ప్రదేశాలలో కొన్ని వస్తువులను ఉంచటం వలన కూడా మన ఇంట్లో పరిస్థితులు ఆధారపడి ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని రకాల వస్తువులను కొన్ని ప్రదేశాలలో పెట్టకూడదని చెబుతున్నారు. దీని కారణంగా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉందట. దీని కారణంగా ఇంట్లో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో కలతలు రావడం ,ఆర్థిక పరిస్థితులు, ఇబ్బంది పడటం, గొడవలు తగాదాలు, వంటివి నెలకొంటాయని అందుకే వాస్తు నియమాలను తూచా తప్పక పాటించడం మంచిదంటూ సూచిస్తున్నారు. అయితే వాస్తు నియమాలు బాత్రూంలో కూడా వర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బాత్రూంలో ఉపయోగించే వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నెగటివ్ ఎనర్జీ పడుతుందని అంటున్నారు. అయితే అసలు బాత్రూంలో ఎలాంటి వస్తువులు ఉంచాలి. ఎలాంటి వస్తువులు ఉండకూడదు. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

these-things-are-in-the-bathroom-is-bad-luck

అద్దాలు…

బాత్రూంలో ఉపయోగించే అద్దాల విషయంలో తూచా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో బాత్రూంలో కూడా అద్దాలను పెడుతున్నారు. ఇలా బాత్రూంలో అద్దాలను ఉంచుకోడం వలన నష్టాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బాత్రూంలో ఉండే అద్దం ఎప్పుడు కూడా విరిగిపోయి ఉండకూడదట. ఒకవేళ విరిగిపోతే దాన్ని వెంటనే మార్చాలని సూచిస్తున్నారు.

బకెట్స్…

మనం బాత్రూంలో ఉపయోగించే బకెట్లు ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ ఖాళీగా ఉంచినట్లయితే దానిని బోర్లించి పెట్టాలని , కాళీ బకెట్ ను అలా ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉంచడం వలన ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని శాస్త్రం చెబుతోంది.

మొక్కలు చిత్రాలు..

ప్రస్తుత కాలంలో చాలామంది బాత్రూంలో కూడా మొక్కలను పెడుతున్నారు. అయితే ఇలా బాత్రూంలో మొక్కలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తొలగించాల్సిందిగా సూచిస్తున్నారు. అదేవిధంగా డెకరేషన్ కోసం బాత్రూంలో పెట్టే చిత్రాలను కూడా పెట్టకూడదని సూచిస్తున్నారు. అదేవిధంగా బాత్రూంలో ఎప్పుడూ ట్యాప్ లీక్ కాకుండా చూసుకోవాలి. ఇలా లీక్ అవడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి అనర్థాలకు దారితీస్తున్నట్లు చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.