Srisailam : శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం….

Srisailam  : నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆలయ చైర్మన్ ఈ ఓవో పెద్దిరాజు అలాగే నాలుగు జిల్లాల అధికారులు పాల్గొనడం జరిగింది.ఇక ఈ సమావేశంలో […]

  • Published On:
Srisailam : శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం….

Srisailam  : నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ మొదటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇక దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్ లో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆలయ చైర్మన్ ఈ ఓవో పెద్దిరాజు అలాగే నాలుగు జిల్లాల అధికారులు పాల్గొనడం జరిగింది.ఇక ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ఈ మహా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా ఆదేశించారు.

ఇక ఈ ఉత్సవాలలో ట్రాఫిక్ , పార్కింగ్, పారిశుధ్యం, త్రాగునీరు వైద్యం వంటి సదుపాయాలు ముఖ్యంగా కల్పించాలని ఆయన కోరారు . అలాగే పాతాళ గంగలో తాత్కాలిక టాయిలెట్స్ డ్రెస్సింగ్ గదులు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అలాగే మహాశివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఏపీ నుండి 500 బస్సులు , అలాగే తెలంగాణ నుండి 450 బస్సులను , కర్ణాటక నుండి 170 బస్సులను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.11 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు దాదాపు రోజుకు లక్ష పదివేల మంది చొప్పున భక్తులు వచ్చే అవకాశం ఉందని కాబట్టి

ఎలాంటి పొరపాట్లు జరగకుండా సీసీ కెమెరాలు తో పాటు మరో 75 కెమెరాలతో , డ్రోన్ కెమెరాలతో ఉత్సవ ఏర్పాటులను పరిశీలించాలని కలెక్టర్ తెలియజేశారు. అలాగే ఆలయ ఈవో తో మాట్లాడిన కలెక్టర్ భక్తులకు స్వామి అమ్మవార్లు దర్శనం సులభంగా జరిగే విధంగా నాలుగు రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక మార్చి 1వ తేదీన శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు మార్చి 3 న శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానం , 4న కానిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే 5 రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మ వారుల కు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలియజేశారు.