PM Modi : అయోధ్యకు ఎవరూ రావద్దు… మోడీ సంచలన నిర్ణయం……

PM Modi  : బాల రాముని దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్ళవద్దని ప్రధానమంత్రి తన కాబినేట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ ప్రోటోకాల్ తో విఐపి ల కారణంగా భక్తులకి అసౌకర్యం కలగకుండా మార్చిలో తమ అయోధ్య కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు సూచించారు. ప్రస్తుతానికి అయోధ్యలో రామ మందిరాని సందర్శించడం మానుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ప్రధానమంత్రి అధ్యక్షత క్యాబినెట్ […]

  • Published On:
PM Modi : అయోధ్యకు ఎవరూ రావద్దు… మోడీ సంచలన నిర్ణయం……

PM Modi  : బాల రాముని దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్ళవద్దని ప్రధానమంత్రి తన కాబినేట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ ప్రోటోకాల్ తో విఐపి ల కారణంగా భక్తులకి అసౌకర్యం కలగకుండా మార్చిలో తమ అయోధ్య కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు సూచించారు. ప్రస్తుతానికి అయోధ్యలో రామ మందిరాని సందర్శించడం మానుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ప్రధానమంత్రి అధ్యక్షత క్యాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా మార్చిలో కేంద్రమంత్రి అయోధ్యకు కార్యక్రమాలు చేయాలి అని అన్నారు.

విపరీతమైన రద్దీ ప్రోటోకాల్స్ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా మార్చిలో అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఇక జనాలని అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలందరి సౌలభ్యం భద్రత సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలన కోరారు. రాములల్లాకు పట్టాభిషేకం తర్వాత ప్రతి ఒక్కరూ భవ్య రాముని చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే దేశ నలుమూల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు . జనవరి 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ధన్యవాదములు తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్యాబినెట్లో ప్రతిపాదించారు. క్యాబినెట్లో రామ మందిరం ప్రతిష్టకు సంబంధించి ప్రజలకు ఏం సందేశం పంపించారని ప్రధానమంత్రి మోడీ అడిగారు. అప్పుడు మంత్రులందరూ ప్రజలకు తమ అభిప్రాయాన్ని తెలిపారు దీని తర్వాత రద్ది కారణంగా ఫిబ్రవరి వరకు రామ మందిరం కోసం వెళ్లకుండా ఉండాలని ప్రధానమంత్రి కోరారు. దీంతో మంత్రులందరూ మార్చిలోనే రామ మందిరాన్ని వెళ్ళనున్నారు.ఇక బుధవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి భక్తులు వేచి ఉండాలని పోలీసులు సూచించారు. ప్రతిరోజు లక్ష మంది శ్రీరాముని దర్శించుకునేందుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని రద్దీని తగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.