Vastu Tips : స్త్రీలు పడుకునే ముందు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ..

Vastu Tips : హిందూ పురాణాల ప్రకారం స్త్రీని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. స్త్రీ సంతోషంగా ఉండని కుటుంబంలో లక్ష్మీదేవి నివాసం ఉండదని, ఆ ఇల్లు దుఃఖాల కుప్పగా ఉంటుందని భావిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం స్త్రీలు చేసే పనులు కుటుంబంపై ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని పరిహారాల వలన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఇంట్లో ప్రతికూల […]

  • Published On:
Vastu Tips : స్త్రీలు పడుకునే ముందు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ..

Vastu Tips : హిందూ పురాణాల ప్రకారం స్త్రీని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. స్త్రీ సంతోషంగా ఉండని కుటుంబంలో లక్ష్మీదేవి నివాసం ఉండదని, ఆ ఇల్లు దుఃఖాల కుప్పగా ఉంటుందని భావిస్తారు. వాస్తు శాస్త్ర ప్రకారం స్త్రీలు చేసే పనులు కుటుంబంపై ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని పరిహారాల వలన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

if-women-do-these-things-before-going-to-bed-goddess-lakshmi-will-sit-wearing-tishta-in-the-house

1) వాస్తు శాస్త్ర ప్రకారం స్త్రీలు పడుకునే ముందు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. దీనివలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి. పడక గదిలో కర్పూరం వెలిగిస్తే భార్య భర్తల బంధం మధురానుభూతిగా ఉంటుంది.

2) సాధారణంగా ఇంట్లో నిద్రపోయే ముందు లైట్లు అన్ని ఆఫ్ చేసి పడుకుంటారు. అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి. దీపం కాకపోయినా ఒక చిన్న బల్బును అమర్చిన సరిపోతుంది. ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతృప్తి చెంది ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

3) అలాగే స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖ ద్వారం వద్ద ఆవ నూనె దీపం వెలిగించాలి. ఈ పరిహార చేయడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. అలాగే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి.

4) స్త్రీలు నిద్రపోయే ముందు దేవుడి గదిలో ఒక అగరబత్తిని వెలిగించాలి. నిద్రపోయే ముందు చేతులు, కాళ్లు కడుక్కొని ఇష్టదైవాన్ని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి నిద్రించాలి.
ఇలా వాస్తు ప్రకారం ఈ పరిహారాలను కనుక స్త్రీలు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని పండితులు చెబుతున్నారు.