Bhogi Festival : భోగి పండుగ రోజు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా…?

Bhogi Festival  : రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగలు తొలి రోజున భోగి పండుగ జరుపుకుంటారు. అయితే భోగి అనే పదం భగ అనే మాట నుండి వచ్చింది. భగ అంటే వేడి లేదా మంట అని అర్థం. దక్షిణాయనకి ఆఖరి రోజున భోగి పండుగను జరుపుకుంటారు. ఇక ఈరోజు తాము ఎదుర్కొన్న కష్టాలను బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవునికి […]

  • Published On:
Bhogi Festival : భోగి పండుగ రోజు భోగి పండ్లు ఎందుకు పోస్తారో తెలుసా…?

Bhogi Festival  : రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పండుగలు తొలి రోజున భోగి పండుగ జరుపుకుంటారు. అయితే భోగి అనే పదం భగ అనే మాట నుండి వచ్చింది. భగ అంటే వేడి లేదా మంట అని అర్థం. దక్షిణాయనకి ఆఖరి రోజున భోగి పండుగను జరుపుకుంటారు. ఇక ఈరోజు తాము ఎదుర్కొన్న కష్టాలను బాధలను భోగిమంటల రూపంలో అగ్ని దేవునికి సమర్పించి ,రాబోయే ఉత్తరాయన కాలంలో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అగ్నిదేవుని ప్రార్థిస్తారు. ఇక ఈ భోగి పండుగ రోజు తెల్లవారుజామున లేచి స్నానాలు ఆచరించి భోగి మంటలు వేస్తారు. ఆవు పెడ, పిడకలు, మామిడి ,రావి , మేడి వంటి చెట్ల అవశేషాలను అలాగే ఇంట్లో పాత వస్తువులను మంటల్లోకి విసిరేస్తారు. ఇక దీనిలో ఎవరైతే ఎక్కువ వస్తువులను తెచ్చి వేస్తారో వారిని గొప్పగా పరిగణిస్తారు.

అదేవిధంగా భోగి పండుగ రోజు కొత్త బియ్యంతో చేసిన పులగం సాంప్రదాయ పెసరపప్పు, నెయ్యి, మిరియాల జోడించి రుచిగా చేసుకొని తినడం ఆనవాయితీ. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపించే ఈ పులగం భోగి పండుగ నాడు తప్పకుండా తినాలని పెద్దలు చెప్తుంటారు. అదేవిధంగా భోగి పండుగనాడు సాయంత్రం వేళ పిల్లల బొమ్మల కొలువలను ఏర్పాటు చేసి పూజిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాలలో అయితే భోగి పండుగ రోజు రైతులు వారి సాగుభూమికి కొంతమేర నీరుపారించి ఆనవాయితీగా తడి చేస్తారు. ఈ పద్ధతిని పులకేయడం అంటారు. అంటే ఒక పంట పూర్తయిన తర్వాత మళ్లీ పంట కొరకు సాగు భూమిలో నీరు పారించడం అని అర్థం.

అదేవిధంగా భోగి పండుగ రోజు రేగుపండ్లను తీసుకువచ్చి భోగి పండ్లు గా పిల్లలపై పోస్తారు. భోగి పండుగ రోజు ఈ విధంగా పిల్లలపై పోస్తారు కాబట్టే వాటిని భోగి పండ్లు అని పిలుస్తారు. అయితే భోగి పండుగ రోజు భోగి పండ్లు పిల్లలపై ఇలా ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు. కానీ దీని వెనక ఒక పరమార్థమే ఉంది. రేగి పండ్లను బదరి పండ్లు అని కూడా అంటారు. అయితే శ్రీమహావిష్ణువు వనంలో బదరీ ఫలాలను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆస్వాదించారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భోగి పండుగ రోజు భోగి పండ్లు పిల్లలపై పోయడం వలన సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఆశీస్సులు పొందుతారని నమ్మకం. అందుకే భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పండ్లు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఇలా చేయడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం పిల్లలపై ఉంటుందని హిందువుల నమ్మకం.